హథ్రాస్ ఘటన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన భోలే బాబా
ఉత్తర్ ప్రదేశ్‌లోని హథ్రాస్‌లో ఇటీవల ఘోరం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 6 July 2024 10:46 AM IST
హథ్రాస్ ఘటన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన భోలే బాబా
ఉత్తర్ ప్రదేశ్‌లోని హథ్రాస్‌లో ఇటీవల ఘోరం చోటుచేసుకుంది. భోలేబాబా కోసం వచ్చిన జనాల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘనటలో 120కి పైగా మంది చనిపోయారు. ఆ తర్వాత భోలే బాబా అజ్ఞాతంలోకి వెళ్లారు. కొద్ది రోజుల పాటు ఎవరికీ కనిపించలేదు. పోలీసులు కూడా ఆయన కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సంఘటన యావత్ దేశౄన్ని దిగ్భ్రాంతికి గురిచేయగా.. భోలే బాబా పేరు దేశం మొత్తం వినిపించింది. తాజాగా భోలే బాబా హథ్రాస్ తొక్కిలాట ఘటనపై స్పందించారు. తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నట్లు భోలే బాబా పేర్కొన్నారు.
జూలై 2న జరిగిన తొక్కిసలాట ఘటనతో చాలా వేదనకు గురయ్యామని చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు బాధను భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. తొక్కిసలాటకు బాధ్యలైన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు అని వ్యాఖ్యానించారు. తనకు ప్రభుత్వంపై నమ్మకం ఉందనీ.. మృతులు, గాయపడిన వారికి అండగా ఉండాలని తన కమిటీ సభ్యులకు సూచించినట్లు భోలే బాబా మీడియాతో మాట్లాడారు.
కాగా.. అలీగఢ్‌తో పాటు హథ్రాస్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో భోలే బాబా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వేల సంఖ్యలో భక్తులు వస్తారు. కొన్నిసార్లు లక్షల్లో జనం వస్తారు. జూలై 2న హథ్రాస్‌లో ఈ కార్యక్రమం నిర్వహించగా.. సత్సంగ్‌కు 80వేల మంది కోసం ఏర్పాట్లు చేశారు. కానీ.. అక్కడికి ఏకంగా 2.5 లక్షల మంది భక్తులు వచ్చారు. దాంతో.. తొక్కిసలాట జరిగి.. మృతుల సంఖ్య పెరిగింది. మరోవైపు సేవదార్ ఆర్మీ ఈ సత్సంగ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తొక్కిసలాట జరిగిన తర్వాత ఎవంటనే ముఖ్యసేవాదర్‌గా ఉన్న దేవ్‌ప్రకాశ్ మధుకర్ పోలీసుల ముందు లొంగిపోయాడు. అతన్ని ప్రధాన నిందితుడిగా పేర్కొన్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.