26న భారత్ బంద్..
Bharat Bandh on February 26.కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ..
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2021 5:57 PM IST
కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతుండగా.. భారత్ బంద్‌కు ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. రెండు వారాలుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుండగా.. ధరల పెంపుపై లారీ యజమానులు ఆందోళనకు దిగారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా శుక్రవారం (ఫిబ్రవరి 26) భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నెల 26న భారత్ బంద్ నిర్వహించాలని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) పిలుపునిచ్చింది. ఈ పిలుపుకి దేశవ్యాప్తంగా దాదాపు 40 వేల ట్రేడ్ అసోసియేషన్లు మద్దతు పలికాయి.
కొత్తగా తీసుకొచ్చిన ఈ-వే బిల్లు నిబంధనలను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. డీజిల్ ధరలు తగ్గించాలని.. దేశవ్యాప్తంగా ధరలు ఒకేలా ఉండాలని కోరారు. ఇప్పటికే సీఏఐటీ ప్రధాని మోడీకి లేఖ రాసింది. జీఎస్టీ విధానాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ-టెయిలర్స్, ఈ-కామర్స్ రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లింది. జీఎస్టీ విధానాన్ని సమీక్షించి, సర్కార్‌కు కొత్త సిఫారసులు చేసే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది.