గుజరాత్ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని పాఠశాలలో ఇకపై భగవద్గీత శ్లోకాలు వినిపించనున్నాయి. 2022-23 విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో భగవద్గీతను ప్రత్యేక సబ్జెక్టుగా బోధించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఇది వర్తిస్తుందని గుజరాత్ విద్యాశాఖ మంత్రి జీతూ వాఘానీ తెలిపారు. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు భగవద్గీతను భోదించనున్నారు.
6,7,8 తరగతుల విద్యార్థులకు కథలు, శ్లోకాల రూపంలో శ్రీమద్ భగవత్ గీత పాఠాలు, 9, 10, 11, 12వ తరగతి విద్యార్థులకు కథ, శ్లోకాలు ఫస్ట్ లాంగ్వేజ్ పాఠ్యపుస్తకంలో ఉండనున్నాయి. భగవద్గీతలోని విలువలను విద్యార్థులకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈ అదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు.. బడుల్లో 'గీత'ను బోధించడంతో పాటు గీత పద్యాలు, దానిపై చర్చ వంటి కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు.
కాగా.. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి.