ఆర్టీసీ ఉద్యోగుల‌కు కొత్త క‌ష్టం.. జీతం కోసం సంచి తీసుకెళ్లాల్సిందే..!

BEST employees salary still paid in coins. ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో భాగంగా రూ.15వేల చిల్ల‌ర నాణేలు ఇవ్వాల‌ని, మిగ‌తా జీతాన్ని బ్యాంకుల్లో డిపాజిటివ్ చేయాల‌ని బెస్ట్ స‌మితి నిర్ణ‌యించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 April 2021 9:56 AM GMT
RTC

మ‌హారాష్ట్ర‌లోని బృహాన్ ముంబై ఎల‌క్రిక్ స‌ప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్‌(బెస్ట్‌) యాజ‌మాన్యం త‌న ఉద్యోగుల‌కు చిల్ల‌ర రూపంలో జీతాలు ఇస్తోంది. ప్ర‌తి రోజు టికెట్ల విక్ర‌యం ద్వారా వివిధ బ‌స్ డిపోల‌కు రూ.ల‌క్ష‌ల్లో చిల్ల‌ర నాణేలు వ‌స్తున్నాయి. దాదాపు రూ.12కోట్ల‌కు పైనే ఈ నాణేలు ఆ సంస్థ ప్ర‌ధాన కార్యాల‌మైన కొలాబాలోని బ‌స్ భ‌వ‌న్‌లో ఉన్నాయి. వీటిని బ్యాంకులో డిపాజిటివ్ చేద్దామ‌ని అనుకుంటే.. పెద్ద మొత్తంలో చిల్ల‌ర తీసుకునేందుకు బ్యాంకులు నిరాక‌రిస్తున్నాయి. దీంతో వాటిని ఏం చేయాలో వారికి తెలియ‌డం లేదు. దీంతో ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో భాగంగా రూ.15వేల చిల్ల‌ర నాణేలు ఇవ్వాల‌ని, మిగ‌తా జీతాన్ని బ్యాంకుల్లో డిపాజిటివ్ చేయాల‌ని బెస్ట్ స‌మితి నిర్ణ‌యించింది.

దీంతో.. చిల్ల‌రను తీసుకెళ్ల‌డానికి ఉద్యోగులు సంచుల‌తో డిపోల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితులు ఉన్నాయి. బృహాన్ ముంబై ఎలక్ట్రిక్‌ సప్లై అండ్‌ ట్రాన్స్‌పోర్ట్ ఆధ్వ‌ర్యంలో న‌డిచే బ‌స్సుల్లో మొదటి 5 కిలోమీటర్ల దూరానికి కనీస బస్సు చార్జీ రూ. 5గా ఉంది. ఆ తరువాత వ‌రుస‌గా టికెట్ ధ‌ర‌లు రూ. 10, రూ. 15 ఇలా చార్జీలు వున్నాయి. బ్యాంకుల‌ సిబ్బంది చిల్ల‌ర‌ డబ్బులు స్వీకరించేందుకు నిరాకరించడంతో అవి దాదాపుగా ప్ర‌ధాన కార్యాల‌యంలోనే పేరుకుపోయాయి. చిల్ల‌ర‌ను డిపాజిట్ చేసేందుకు జ‌న‌వ‌రిలో ఓ ప్రైవేటు బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నా.. సాంకేతిక కార‌ణాల‌తో అది కార్య‌రూపం దాల్చ‌డం లేద‌ని అధికారులు చెబుతున్నారు. ఆ సంస్థ ప‌రిధిలో దాదాపు 40 వేల మందికిపైగా ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. వేతనాల్లో కొంత చిల్ల‌ర రూపంలో చేతికి, మ‌రికొంత బ్యాంకుల్లో వేయాల‌ని సంస్థ తీసుకున్న‌ నిర్ణయాన్ని సంస్థ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.




Next Story