రూ.8వేలు ఇస్తారని చెప్పడంతో పోస్టాఫీస్ వద్ద మహిళల క్యూ.. చివరకు
సోషల్ మీడియాతో నిత్యం చాలా వార్తలు ప్రచారం అవుతూ ఉంటాయి.
By Srikanth Gundamalla Published on 30 May 2024 6:36 AM ISTరూ.8వేలు ఇస్తారని చెప్పడంతో పోస్టాఫీస్ వద్ద మహిళల క్యూ..చివరకు
సోషల్ మీడియాతో నిత్యం చాలా వార్తలు ప్రచారం అవుతూ ఉంటాయి. వీటిలో ఎక్కువ శాతం న్యూస్ ఫేక్. కానీ.. అవి గుర్తించిన కొందరు జనాలు గుడ్డిగా ఫాలో అవుతుంటారు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే జరిగాయి. తాజాగా బెంగళూరులో కూడా ఫేక్ వార్తను నమ్మిన మహిళలు షాక్ తిన్నారు. సోమవారమే ఇది జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే.. కర్ణాటకలోని బెంగళూరులో పోస్టాఫీసులకు మహిలలు పెద్ద సంఖ్యలో సోమవారం తరలి వచ్చారు. ఒకేసారి వేల సంఖ్యలో మహిళలు పోస్టాఫీస్‌కు రావడంతో అధికారులు, ఉద్యోగులు కూడా ఆశ్చర్యపోయారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దాంతో.. ఎక్కవ మొత్తంలో మహిళలు పోస్టాఫీస్ వద్దకు వెళ్లి క్యూకట్టారు. అక్కడ ఉద్యోగులు వారిని ఏం కావాలని ఆరా తీశారు. దాంతో.. తాము సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పారు. దాంతో.. ఉద్యోగులు దానిదేముంది చేసేయొచ్చు అని కొందరు మహిళలో అకౌంట్ ఓపెన్ చేయించారు.
అప్పుడు మహిళలు పోస్టాఫీస్ ఉద్యోగులను అడిగిన ప్రశ్నకు షాక్ తిన్నారు. అకౌంట్ ఓపెన్ చేశాం కదా.. రూ.8వేలు ఎప్పుడు అకౌంట్లో వేస్తారు అని అడిగారు. దానికి ఏమీ అర్థం కాక.. మీరే వేస్తారా అన్నట్లుగా తిరిగి ప్రశ్నించారు ఉద్యోగులు. దాంతో.. మేం కాదు..రాజకీయ పార్టీలే రూ.8వేలు సేవింగ్స్ అకౌంట్స్ తెరిస్తే వేస్తారని చెప్పారు కదా అని మహిళలు చెప్పుకొచ్చారు. వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్‌లను కూడా చూపించారు. దాంతో.. విషయం అర్థం చేసుకున్న పోస్టాఫీస్ ఉద్యోగులు అవన్నీ ఫేక్ వార్తలనీ.. అలాంటి ఆదేశాలేమీ రాలేదని వివరించారు. ఇక చివరకు పోస్టాఫీస్‌కు వేల సంఖ్యలో వచ్చిన మహిళలు నిరాశతోనే వెనుదిరిగారు. సోమవారం బెంగళూరులోని జీపీవో దగ్గర ఉదయం 3 గంటల నుంచే మహిళలు క్యూ కట్టారు. దాంతో.. వారిని అదుపు చేసేందుకు భద్రతను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఫేక్ మెసేజ్ వల్లే ఇదంతా జరిగిందని తెలియడంతో..మహిళలంతా ఇళ్లకు వెనుదిరిగారు. వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ మెసేజ్‌లను గుడ్డిగా నమ్మొద్దని అధికారులు చెబుతున్నారు.