ప్రాణం తీసిన కరెంటు తీగ.. 9 నెలల చిన్నారి, తల్లి మృతి

విద్యుత్‌ వైరు రోడ్డుపై తెగి పడింది. చీకట్లో గమనించక ఆ వైరుపై కాలు వేయడంతో తల్లి, ఆమె 9 నెలల బిడ్డ మరణించారు.

By అంజి  Published on  20 Nov 2023 1:58 AM GMT
Bengaluru, Bangalore police, electrocuted, Live Wire

ప్రాణం తీసిన కరెంటు తీగ.. 9 నెలల చిన్నారి, తల్లి మృతి

బెంగళూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. నవంబర్ 19, ఆదివారం నాడు బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై పడి ఉన్న కరెంట్‌ వైర్‌ తగిలి కరెంట్‌ షాక్‌తో ఓ మహిళ, ఆమె తొమ్మిది నెలల పాప మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 23 ఏళ్ల సౌందర్య తన కుమార్తె సువిక్షతో కలిసి తమిళనాడు నుంచి బెంగళూరుకు తిరిగి వస్తుండగా తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కరెంట్‌ ప్రవహిస్తున్న వైర్ ఫుట్‌పాత్‌పై పడి ఉంది. చీకట్లో గమనించక ఆ వైరుపై కాలు వేయడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.

ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు వైట్‌ఫీల్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రెస్‌కు ఒక ప్రకటనలో తెలిపారు. ముగ్గురు బెస్కామ్ అధికారులను విచారిస్తున్నారు. సౌందర్య భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తమిళనాడులోని కడలూరుకు చెందిన దంపతులు. గతేడాది సెప్టెంబరులో బెంగళూరులో వర్షాల కారణంగా నీరు నిలిచిన రోడ్డుపై జారిపడి విద్యుదాఘాతానికి గురై ఓ బాలిక మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (బెస్కామ్)పై ఫిర్యాదు చేశారు.

Next Story