బెంగాల్‌లో రైలు ప్రమాదానికి కారణమిదే..
పశ్చిమబెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 17 Jun 2024 7:45 AM GMTబెంగాల్‌లో రైలు ప్రమాదానికి కారణమిదే..
పశ్చిమబెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రంగపాణి రైల్వే స్టేషన్ దగ్గర కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలును.. అదే పట్టాలపై వచ్చిన గూడ్స్ ట్రైన్ వెనకాల నుంచి ఢీకొట్టింది. దాంతో ప్రమాదం సంభవించింది. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలులోని మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. గూడ్స్ ట్రైన్ బోగీలు పట్టాలుతప్పి పక్కకు పడిపోయాయి. అంతేకాదు.. ఒక బోగీ మరో బోగీ మీదకు ఎక్కడే.. ప్రమాద తీవ్రతను తెలుపుతుంది.
ఈ రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెబుతున్నారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు చెప్పారు. రెస్క్యూటీమ్‌లు, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు, స్థానికులతో సహా అందరూ సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతోన్నట్లు తెలుస్తోంది.
కాగా..ఈ ప్రమాదానికి గల కారణంపై చాలా మంది ఆరా తీస్తున్నారు. గూడ్స్ రైలు సిగ్నల్‌ను దాటుకుని.. కాంచన్‌జంగా రైలును వద్దకు వచ్చేసిందని ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు రైల్వే అధికారులు. దాంతో ఆగి వున్న కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనకాల ఉంచి ఢీకొట్టిందని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నామనీ.. పూర్తి వివరాలను త్వరలో వెల్లిస్తామని చెప్పారు. కాగా.. ఈ ప్రమాదం తర్వాత అగర్తల-కోల్‌కతా రైలు మార్గం దెబ్బతిన్నది. పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు.
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుకాల నుంచి గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురి చనిపోయినట్లు తెలుస్తోంది. 100 మంది వరకు గాయపడినట్లు సమాచారం. సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. pic.twitter.com/T13AVzad4o
— Newsmeter Telugu (@NewsmeterTelugu) June 17, 2024