సీఎం సమక్షంలో గవర్నర్‌కు అక్షరాభ్యాసం.!

Bengal Governor to have ‘Hateykhori’ to learn Bangla alphabet. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్ సి.వి.ఆనంద బోస్‌కు అక్షరాభ్యాసం జరగనుంది.

By అంజి  Published on  20 Jan 2023 4:11 AM GMT
సీఎం సమక్షంలో గవర్నర్‌కు అక్షరాభ్యాసం.!

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్ సి.వి.ఆనంద బోస్‌కు అక్షరాభ్యాసం జరగనుంది. అది కూడా సీఎం మమతా బెనర్జీ సమక్షంలో. అయితే గవర్నర్‌ ఆనంద బోస్‌కు ఈ వయసులో అక్షరాభ్యాసం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?.. కాని ఇదే నిజం. ఈ నెల 26న సరస్వతీ పూజను పునస్కరించుకుని సీఎం మమతా బెనర్జీ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుందని ఓ అధికారి తెలిపారు. సాధారణంగా బెంగాల్‌లో చిన్న పిల్లలు బంగ్లా అక్షరాలు నేర్చుకునే ముందు 'హతేఖోరి' అనే క్రతువును నిర్వహిస్తారు. ఇప్పుడే ఇదే క్రతువును గవర్నర్‌ నిర్వహించనున్నారు.

గవర్నర్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, ఆనంద బోస్ ఒక పుస్తకం రాయడానికి బంగ్లా నేర్చుకోవాలని తన ఆసక్తిని వ్యక్తం చేశాడు. రాజ్‌భవన్‌లో 'హతేఖోరీ' కార్యక్రమం నిర్వహించనున్నారు. ''గవర్నర్ బోస్ పశ్చిమ బెంగాల్, దాని గొప్ప సంస్కృతి, బంగ్లాచే లోతుగా ప్రభావితమయ్యారు. ప్రేరణ పొందారు. భాష నేర్చుకోవాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. సరస్వతీ పూజ యొక్క శుభ సందర్భంలో అతను 'హతేఖోరి' క్రతువును పూర్తి చేస్తారు'' అని అధికారి మీడియాకు తెలిపారు.

గవర్నర్‌ ఆనంద బోస్.. భాష పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. తనను తాను రాష్ట్రానికి "దత్తపుత్రుడు" అని పిలుచుకున్నాడు. యాదృచ్ఛికంగా బోస్.. ఇంగ్లీషు, మలయాళం, హిందీ భాషలలో దాదాపు 40 పుస్తకాలను రాశారు. ఇందులో చిన్న కథలు, నవలలు, కవితలు, వ్యాసాలు ఉన్నాయి. ఇప్పుడు బోస్‌ బంగ్లా భాషలో పుస్తకం రాయలనుకుంటున్నారు. అందుకోసమే బంగ్లా భాష నేర్చుకుంటున్నారు.

Next Story