ఎమ్మెల్యేల వేతనాలను పెంచుతున్నట్లు మమతా బెనర్జీ ప్రకటన

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎమ్మెల్యేల జీతాలను పెంచారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Sep 2023 12:52 PM GMT
bengal, cm mamata, mla salary hike  ,

ఎమ్మెల్యేల వేతనాలను పెంచుతున్నట్లు మమతా బెనర్జీ ప్రకటన

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎమ్మెల్యేల జీతాలను పెంచారు. వారి వేతనాలను నెలకు రూ.40,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ చాలా కాలంగా వేతనం తీసుకోవడం లేదు. ఇకపై కూడా తీసుకోనని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేల వేతనాలు తక్కువగా ఉండడంతో.. వారి వేతనాలను నలభై వేల రూపాయలు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పెంపు నిర్ణయం ప్రకటన తర్వాత ఎమ్మెల్యేల వేతనాలు ప్రస్తుతం ఉన్న రూ.10వేల నుండి రూ.50వేలకు పెరగనున్నాయి. మంత్రుల జీతాలు రూ.10,900 నుండి రూ.50,900కు పెరగనున్నాయి. కేబినెట్ మంత్రుల వేతనాలు రూ.11వేల నుండి రూ.51వేలకు పెరగనున్నాయి. అలవెన్స్‌లు, ఇతర ప్రయోజనాలు అదనం. వాటిని కలుపుకుంటే ఎమ్మెల్యేలకు రూ.1.21 లక్షలు, మంత్రులకు రూ.1.50 లక్షలు అందనున్నాయి. "ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎమ్మెల్యేల జీతం చాలా తక్కువ. కాబట్టి వారి జీతాలను నెలకు ₹ 40,000 పెంచాలని నిర్ణయించాము" అని మమతా బెనర్జీ చెప్పారు.


Next Story