శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా జంతు వధ, మాంసం విక్రయాలపై నిషేదం విధిస్తూ బెంగళూరు పౌరసరఫరాల సంస్థ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవర్ధక శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం BBMP ఏరియా పరిధిలోని అన్ని కబేళాలు మూసివేయడంతో పాటు మాంసం రిటైల్ విక్రయ దుకాణాలను మూసివేయాలని అందులో పేర్కొంది.
ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 19న (శుక్రవారం) బెంగళూరు నగరంలోని కబేలాలు, మాంసం విక్రయించే దుకాణాలు మూసి ఉంచాలని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 5,249వ కృష్ణ జయంతి ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ అధికారులు మాంసం అమ్మకాలపై విధించారు.
ఈ ఏడాది జన్మాష్టమిని గురు, శుక్రవారాల్లో జరుపుకుంటున్నారు. జన్మాష్టమి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలోని ఎనిమిదవ రోజున జరుపుకుంటారు. ఇది సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వస్తుంది.
గతంలో.. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ నెలలోనూ మాంసం అమ్మకాలను నిషేధించారు. బసవజయంతి, మహా శివరాత్రి, గాంధీ జయంతి, సర్వోదయ డేల సందర్భంగా బెంగళూరు నగరంలో ఏడాదిలో 8 రోజుల పాటు మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నారు.