క‌శ్మీర్‌లో బ్యాంకు మేనేజ‌ర్ దారుణ హ‌త్య‌

Bank Manager shot dead by terrorists in South Kashmir's.జ‌మ్మూ క‌శ్మీర్‌లో సామాన్య పౌరులు, మైనార్టీల‌పై ఉగ్ర‌వాదుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jun 2022 3:40 PM IST
క‌శ్మీర్‌లో బ్యాంకు మేనేజ‌ర్ దారుణ హ‌త్య‌

జ‌మ్మూ క‌శ్మీర్‌లో సామాన్య పౌరులు, మైనార్టీల‌పై ఉగ్ర‌వాదుల దారుణాలు ఆగ‌డం లేదు. గురువారం దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో రాజస్థాన్‌కు చెందిన బ్యాంక్ మేనేజర్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల్లో లోయలో హిందువులపై దాడి చేయడం ఇది రెండవది. జమ్మూకి చెందిన హిందూ ఉపాధ్యాయ‌నీ రజనీ బాలాను కుల్గామ్‌లోని పాఠశాల వెలుపల ఉగ్రవాదులు కాల్చి చంపిన రెండు రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.

ఎల్లాఖీ దేహతి బ్యాంక్ కుల్గాం బ్రాంచ్‌లో బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న విజయ్ కుమార్‌పై జిల్లాలోని అరేహ్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో నివాసం ఉంటున్న కుమార్ గత వారం కుల్గాంలో తన పోస్టింగ్‌లో చేరాడు. బ్యాంకు ఆవరణలోనే అతడిపై కాల్పులు జరిగాయి. ఆయన్ను ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. ఉదయం బ్యాంకులోకి వస్తుండగా తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టామని, దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇక క‌శ్మీరులో వ‌రుస ఘ‌ట‌న‌ల‌పై మైనార్టీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌కు భ‌ద్ర‌త క‌ల్పించాలంటూ గ‌త కొన్ని రోజులుగా ఆందోళ‌న చేస్తున్నారు. ఈ నెల 1 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు క‌శ్మీర్‌లో ఎనిమిది ల‌క్షిత హ‌త్య‌లు జ‌రిగాయి. ఇందులో ఆఫ్ డ్యూటీలో ఉన్న ముగ్గురు పోలీసులు, ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Next Story