8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం.. దత్తన్న బదిలీ.. హరిబాబుకు పదవి
Bandaru Dattatreya,Governors,Kambhampati Haribabu,Union Govt.దేశంలోని 8 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం
By తోట వంశీ కుమార్ Published on
6 July 2021 7:32 AM GMT

దేశంలోని 8 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించింది. బండారు దత్తాత్రేయకు స్థాన చలనం కలుగగా.. ఏపీ బీజేపీ నేత కంభంపాటి హరిబాబును గవర్నర్ పదవి వరించింది. మిజోరం గవర్నర్‌గా బీజేపీ నేత కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయను హరియాణాకు బదిలీ చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్‌గా మంగూభాయ్ ఛగన్‌భాయ్ పటేల్, కర్ణాటక గర్నర్నర్‌గా థావర్‌చంద్ గెహ్లాట్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా రాజేంద్రన్ విశ్వనాథ్ పర్లేకర్, గోవా గవర్నర్‌గా పీఎస్ శ్రీధరన్ పిళ్లై, త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, జార్ఖండ్ గవర్నర్‌గా రమేష్ బయాట్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story