మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఒంటరివాడు అయిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే మనవడు నిహార్ థాక్రే .. సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరారు. త్వరలో ఈస్ట్ అంథేరికి జరగనున్న ఉపఎన్నికలో ఉద్థవ్ వర్గానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నారు. అంధేరి ఈస్ట్ నియోజకవర్గంలో నవంబర్ 3న ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. షిండే క్యాంప్ మద్ధతుతో బీజేపీ పార్టీ పటేల్‌ను పోటీకి దింపింది. అటు ఉద్థవ్ థాక్రే వర్గం రితుజా లాట్కేను అభ్యర్ధిగా ఎంపిక చేసింది.
శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కుప్పకూలడంతో ఉద్ధవ్ థాక్రే సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. బీజేపీ మద్ధతుతో ఏక్‌నాథ్ షిండే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఉద్ధవ్ థాక్రే సొదరుడు బిందు మాధవ్ థాక్రే (బాల్ థాక్రే పెద్ద కుమారుడు) తనయుడే నిహార్ థాక్రే తాజాగా ఉద్ధవ్ టీమ్ ను వీడారు. నిహార్ రాజకీయాల్లో అంత యాక్టీవ్‌గా లేరు. లాయర్‌గా తన ప్రాక్టీస్ చూసుకుంటున్నారు. గతేడాది డిసెంబర్‌లో బీజేపీ నేత హర్షవర్థన్ పాటిల్ కుమార్తె అంకితా పాటిల్‌ను నిహార్ పెళ్లి చేసుకున్నారు.