చెక్క డబ్బాలో చిన్నారి.. నదిలో వదిలివేశారు
Baby Girl Found Floating in a Box in Ganga River.అభం, శుభం తెలియని 21 రోజుల చిన్నారిని ఓ చెక్క డబ్బాలో పెట్టి నదిలో
By తోట వంశీ కుమార్ Published on 17 Jun 2021 4:42 AM GMTఅభం, శుభం తెలియని 21 రోజుల చిన్నారిని ఓ చెక్క డబ్బాలో పెట్టి నదిలో వదిలివేశారు. పాపం ఆ చిన్నారి నది ప్రవాహానికి కొట్టుకుపోతుంది. అదే సమయంలో అటుగా వెలుతున్న ఓ బోటు యజమానికి నీటిపై తేలియాడుతున్న చెక్క డబ్బాలోంచి ఏడుపు వినిపించింది. వెంటనే అతడు దాని దగ్గరకు బోటును తీసుకెళ్లి.. ఆ చెక్క డబ్బా తెరిచి ఆశ్చర్యపోయాడు. ఆ డబ్బాలో చిన్నారితో పాటు జాతక వివరాలు, దేవుళ్ల చిత్రపటాలు ఉన్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గాజీపుర్‌లో చోటుచేసుకుంది.
ఇదీ జరిగింది.. గంగా నది దాద్రీ ఘాట్ సమీపంలో నీటిపై తేలుతున్న ఓ చెక్క డబ్బాలోంచి నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. అటుగా వెలుతున్న బోటు యజమాని మల్లాహ్ గుల్లు దాన్ని తెరిచి చూశాడు. 21 రోజుల వయసు ఉన్న ఆ చిన్నారితో పాటు జాతకం, దేవుళ్ల చిత్రపటాలు( దుర్గామాత, విష్ణుమూర్తి) ఆ డబ్బాలో ఉన్నాయి. వెంటనే అతడు ఆ చిన్నారిని తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. ఆ చిన్నారికి సాన్నం చేయించి ఆహారం అందించాడు. ఆ చిన్నారిని తానే పెంచుకోవాలని ఆశపడ్డాడు. అయితే.. చిన్నారి దొరికిన విషయం స్థానికుల ద్వారా పోలీసులకు తెలిసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పాపను సంరక్షణ కేంద్రానికి తరలించారు. రాష్ట్ర బాలల సంక్షేమ మండలి.. ఆ చిన్నారి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకోవాలని ఆదేశించింది. చిన్నారుల తల్లిదండ్రులు దొరికే వరకు ఆ పాప సంరక్షణను ప్రభుత్వమే చూసుకుంటుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.