ట్రాన్స్ జెండ‌ర్‌ను పెళ్లి చేసుకున్న యువ‌కుడు

Azamgarh young man got married in love with Transgender.ట్రాన్స్‌జెండ‌ర్‌ను ఓ యువ‌కుడు పెళ్లి చేసుకున్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Dec 2022 2:47 PM IST
ట్రాన్స్ జెండ‌ర్‌ను పెళ్లి చేసుకున్న యువ‌కుడు

ప్రేమ‌.. ఎప్పుడు ఎందుకు ఎవ్వ‌రి మ‌ధ్య‌న ఎలా పుడుతుందో తెలియ‌దు. ప్రేమ‌కు మ‌తం, కులం, వ‌య‌స్సు, పేద‌, ధ‌నిక అన్న సంబంధం లేదని అంటారు. కొంద‌రు ప్రేమించిన వారి కోసం ఏం చేసేందుకైనా వెనుకాడ‌రు. కొంద‌రు పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లిచేసుకుంటే మ‌రికొంద‌రు రిజిస్టార్ ఆఫీసులో ఒక్క‌టి అవుతుంటారు. ఇదిలా ఉంటే.. ఓ ప్రేమ జంట చేసుకున్న వివాహం ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అజంగ‌ఢ్ జిల్లాలో ట‌కై గ్రామంలో వీరూ రాజ్‌భ‌ర్‌(24) అనే యువ‌కుడు త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. రెండు సంవ‌త్స‌రాల క్రితం ప‌శ్చిమ బెంగాల్‌లోని జ‌ల్‌పాయ్‌గుడికి చెందిన ముస్కాన్ కిన్నార్ అనే ట్రాన్స్ జెండ‌ర్ బ్రాస్ బ్యాండ్ పార్టీలో డ్యాన్స్ చేసేందుకు మౌకి వ‌చ్చింది. అక్క‌డ వీరిద్ద‌రికి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. తొలి చూపుల్లోనే ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ్డారు. అప్ప‌టి నుంచి వారిద్ద‌రూ స‌హ‌జీవనం చేస్తున్నారు.

ఇటీవ‌ల వీరు పెళ్లి చేసుకోవాల‌ని బావించారు. ఈ విష‌యాన్ని ఇరు కుటుంబాల్లో చెప్ప‌గా అందుకు వారు అంగీక‌రించారు. దీంతో శుక్ర‌వారం వీరిద్ద‌రూ బైరోధం గుడిలో వేద‌మంత్రాల సాక్షిగా సంప్ర‌దాయ బ‌ద్దంగా వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం వీరి పెళ్లి నెట్టింట వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story