శబరిమల లోని అయ్యప్ప స్వామి సన్నిధానం నవంబరు 16 సాయంత్రం 5 గంటలకు తెరుచుకుంది. మేల్‌శాంతిగా ఎంపికైన ప్రసాద్ నంబూద్రి శనివారం ఉదయం పంపా బేస్ వద్ద ఇరుముడి కట్టుకుని, ఆదివారం సాయంత్రానికి సన్నిధానం చేరుకున్నారు. పద్దెనిమిది మెట్లను అధిరోహించిన తర్వాత ఆయన శబరిమల సన్నిధానం ద్వారాలకు హారతి ఇచ్చి, ఆలయం తలుపులును తెరిచారు.
భక్తులకు సహాయం అందించేలా వాలంటీర్లకు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పలు భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.కొండను అధిరోహించేప్పుడు అలసట, ఛాతీ నొప్పి రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే తక్షణం వైద్య సాయం కోసం 04735 203232 నంబరుకు కాల్ చేయాలని అధికారులు సూచించారు.