సిల్వర్ స్క్రీన్లపై అయోధ్య రాముడి వేడుక, రూ.100 మాత్రమే

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు మరో ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది.

By Srikanth Gundamalla  Published on  20 Jan 2024 2:36 AM GMT
ayodhya, ram mandir, pran pratishtha, silver screens,

సిల్వర్ స్క్రీన్లపై అయోధ్య రాముడి వేడుక, రూ.100 మాత్రమే

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు మరో ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. వేల మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. అయితే.. సోమవారం జరిగే బాలురాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించేందుకు లైవ్‌ పెట్టనున్నారు. ఈ మహాఘట్టం కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కొందరు అయోధ్యకు వెళ్తుంటే..ఇంకొందరు ఇంటి వద్ద టీవీల్లో చూసేందుకు రెడీ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో సిల్వర్ స్క్రీన్‌పై కూడా అయోధ్య రాముడి పండగను చూసే అవకాశం కల్పిస్తున్నాయి ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలు పీవీఆర్, ఐనాక్స్. అది కూడా కేవలం రూ.100 టికెట్‌తోనే ఈ అవకాశం కల్పిస్తున్నాయి. దేశంలోని 70 ప్రధాన నగరాల్లో 170 కంటే ఎక్కువ కేంద్రాల్లో అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మ.3 గంటల వరకు బిగ్‌స్క్రీన్‌పై ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు. అయితే.. టికెట్‌ ధర కూడా ఎప్పటిలా కాకుండా రూ.100కే అందివ్వనున్నట్లు చెప్పారు. ఇందులో కూల్‌డ్రింక్స్‌, పాప్‌కార్న్‌ కాంబో కూడా ఉంటుందట. గతంలో పీవీఆర్, ఐనాక్స్‌లు వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ క్రమంలోనే అయోధ్యలో రామాలయం నిర్మాణం చారిత్రక ఘట్టం.. అందుకే పెద్ద తెరపై చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐనాక్స్‌ కో-సీఈవో గౌతం దత్తా వెల్లడించారు.

ఆయా మల్టీప్లెక్స్‌ల అధికారిక వెబ్‌సైట్లు, అలాగే ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్ బుక్‌మై షోలో కూడా అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించేందుకు టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఇక చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవన్, రామ్‌చరణ్, మోహన్‌బాబు, ప్రభాస్‌, రణబీర్ కపూర్, అమితాబ్‌ బచ్చన్, రిషబ్‌ శెట్టి, యష్, కంగనా రనౌత్‌, ఆలియాభట్ సహా పలువురికి రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందాయి. రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న మధ్యాహ్నం 12:15 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగుస్తుంది.


Next Story