గాంధీజీ మనవడు అరుణ్ గాంధీ కన్నుమూత
మహాత్మా గాంధీ మనవడు, సుశీల, మణిలాల్ గాంధీల కుమారుడు అరుణ్ గాంధీ మంగళవారం ఉదయం ఇక్కడ కన్నుమూసినట్లు
By అంజి Published on 2 May 2023 3:45 PM ISTగాంధీజీ మనవడు అరుణ్ గాంధీ కన్నుమూత
మహాత్మా గాంధీ మనవడు, సుశీల, మణిలాల్ గాంధీల కుమారుడు అరుణ్ గాంధీ మంగళవారం ఉదయం ఇక్కడ కన్నుమూసినట్లు ఆయన కుమారుడు తెలిపారు. ఆయనకు 89 ఏళ్లు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చివరకు కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు కుమారుడు తుషార్, కుమార్తె అర్చన, నలుగురు మనవళ్లు, ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు. తనను తాను 'శాంతి రైతు'గా పేర్కొన్న అరుణ్ గాంధీ అంత్యక్రియలు ఈ సాయంత్రం కొల్హాపూర్ జిల్లాలోని వాషి నంద్వాల్‌లో జరగనున్నాయి.
Bereaved. Lost my father this morning🙏🏽
— Tushar बेदखल (@TusharG) May 2, 2023
అరుణ్ గాంధీ మృతి వార్తను ఆయన కొడుకైన తుషార్ గాంధీ.. ట్విట్టర్ ద్వారా తెలిపారు. "ఇవాళ ఉదయం మా నాన్న చనిపోయారు. ఆయన లేని లోటును తట్టుకోలేకపోతున్నాం" అని తుషార్ ట్వీట్ చేశారు. దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్ లో 1934 ఏప్రిల్ 14న మణిలాల్ గాంధీ, సుశీలా మష్రూవాలా దంపతులకు అరుణ్ గాంధీ జన్మించారు. రచయిత, సామాజిక-రాజకీయ కార్యకర్తగా ఆయన అందరికి సుపరిచితం. అరుణ్ గాంధీ బెథానీ హెగెడస్‌తో కలిసి ' కస్తూర్బా , ది ఫర్‌గాటెన్ ఉమెన్', 'గ్రాండ్ ఫాదర్ గాంధీ' వంటి పుస్తకాలను రాశాడు. 1982లో తన తాత జీవితం ఆధారంగా తీసిన చిత్రానికి 25 మిలియన్ డాలర్లు సబ్సిడీ ఇచ్చిన తర్వాత భారత ప్రభుత్వాన్ని ఒక వ్యాసంలో విమర్శించారు.