కమల్‌హాసన్ కారుపై మందుబాబు దాడి

Attack on Kamal Hasaan's car alleged. మక్కల్ నీది మయం (ఎంఎన్‌ఎం)పార్టీ అధినేత కమల్ హాసన్ కారుపై ఓ మందుబాబు దాడికి యత్నించారు.

By Medi Samrat
Published on : 15 March 2021 9:39 AM IST

Attack on Kamal Hasaan’s car alleged

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయం (ఎంఎన్‌ఎం)పార్టీ అధినేత కమల్ హాసన్ కారుపై ఓ మందుబాబు దాడికి యత్నించారు. ప్రచార కార్య‌క్ర‌మంలో భాగంగా కమల్ హాసన్ కంచీపురంలో పర్యటించి కారులో వెళుతుండగా ఓ యువకుడు అడ్డుకోవడానికి ప్రయత్నించాడు.


పుల్లుగా మద్యం తాగి ఉన్న యువకుడు కమల్ హాసన్ ను కారును అడ్డుకోబోయాడు. ఈ ఘటనలో కారు కిటికీ గ్లాసు దెబ్బ‌తింది. అయితే యువకుడి దాడిలో కమల్ హాసన్ కు ఎలాంటి గాయాలు కాలేదని, కారు అద్దం మాత్రం పగిలిందని ఎంఎన్ఎం కార్యకర్తలు తెలిపారు. కమల్ హాసన్ పై దాడికి యత్నించిన యువకుడిని ఎంఎన్ఎం కార్యకర్తలు చుట్టుముట్టి కొట్ట‌డంతో నిందితుడి ముక్కు నుంచి రక్తస్రావం జరిగింది.


సంఘటన స్థలంలో ఉన్న‌ పోలీసులు ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చి యువకుడిని ఆసుపత్రికి తరలించారు. యువకుడు మద్యం తాగి ఉన్నాడని, కమల్ హాసన్ ను చూడాలని కారు కిటికీ అద్దాన్ని పగులగొట్టాడని పోలీసులు చెప్పారు. కాగా కమల్ హాసన్ పై యువకుడు దాడి చేసేందుకు యత్నించాడని.. దీంతో తమ కార్యకర్తలు అతన్ని పోలీసులకు అప్పగించారని ఎంఎన్ఎం నాయకుడు, రిటైర్డు ఐపీఎస్ అధికారి మౌర్యా ట్వీట్ చేశారు.


Next Story