ఆపరేషన్ సింధూర్‌పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లోని టెర్రరిస్ట్ స్థావరాలపై భారత్ నిర్వహించిన దాడులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. మరో పహల్గామ్ ఘటన జరగకుండా పాక్‌కు ఇలాగే సరైన గుణపాఠం చెప్పాలన్నారు. పాక్ టెర్రర్ స్థావరాలు అన్నింటీని పూర్తిగా ధ్వంసం చేయాలన్నారు. జై హింద్ అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. అటు భారత్ నిర్వహించిన మెరుపు దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం.
ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ఆర్మీ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ అలర్ట్ అయింది. లాహోర్, సియాల్‌కోట్ ఎయిర్‌పోర్టులను 48 గంటల పాటు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటు పౌరులు అప్రమత్తంగా ఉండాలని పలు ప్రాంతాల్లోని మసీదుల నుంచి అధికారులు అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పౌరుల ఊచకోత జరిగిన రెండు వారాల తర్వాత 'ఆపరేషన్ సిందూర్' కింద సైనిక దాడులు జరిగాయి.