ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కు జెడ్ కేటగిరీ భద్రత

Asaduddin Owaisi gets ‘Z’ category security cover day after gun attack in UP.ఎంఐఎం చీఫ్, లోక్ సభ ఎంపీ అసదుద్దీన్

By M.S.R  Published on  4 Feb 2022 3:08 PM IST
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కు జెడ్ కేటగిరీ భద్రత

ఎంఐఎం చీఫ్, లోక్ సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన కారుపై గురువారం దుండగులు కాల్పులు జరిపారు. ఈ ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. ఈ దాడి నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ భద్రతను కేంద్ర హోంశాఖ సమీక్షించింది. ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించేందుకు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జెడ్ కేటగిరీలో 22 మంది రక్షణ సిబ్బంది ఉంటారు. ఇందులో నాలుగు నుంచి ఆరుగురు ఎన్ఎస్జీ కమాండోలు, మిగిలిన వారు పోలీసు సిబ్బంది ఉంటారు. అసుద్దీన్ ఒవైసీ తాను భద్రతను ఎప్పుడూ కోరలేదని, కోరబోనని స్పష్టం చేశారు. ఎందుకంటే తన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.

గురువారం నాడు యూపీలో ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తున్న సమయంలో హపూర్-ఘజియాబాద్ జాతీయ రహదారిపై జిరార్సి టోల్ ప్లాజా సమీపంలో సాయంత్రం 6 గంటల సమయంలో ఒవైసీపై దాడి జరింది.అసదుద్దీన్ ట్వీట్ చేస్తూ "కొంత సమయం క్రితం నా కారు చిజార్సి టోల్ గేట్ వద్ద కాల్పులు జరిపారు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. అక్కడ 3-4 మంది ఉన్నారు, అందరూ పారిపోతూ ఆయుధాలు అక్కడే వదిలేశారు. నా కారు పంక్చర్ అయింది, కానీ నేను మరొక కారులో వెళ్ళిపోయాను. మేమంతా క్షేమంగా ఉన్నాం. అల్హమ్దులిల్లాహ్." అని చెప్పుకొచ్చారు. ఒవైసీ పోస్ట్ చేసిన చిత్రాలలో కారు రెండు డోర్‌లకు రెండు రంధ్రాలు కనిపించాయి. దాడిలో తన వాహనం టైర్లు కూడా పంక్చర్ అయ్యాయని అసదుద్దీన్ చెప్పారు.

Next Story