'కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు'.. కన్నీటి ప‌ర్యంత‌మైన‌ మాజీ సీఎం

కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఢిల్లీలోని కొత్త ఎక్సైజ్ పాలసీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ దాఖలు చేసిన కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐకు నేడు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

By -  Medi Samrat
Published on : 27 Feb 2026 11:51 AM IST

కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు.. కన్నీటి ప‌ర్యంత‌మైన‌ మాజీ సీఎం

కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఢిల్లీలోని కొత్త ఎక్సైజ్ పాలసీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ దాఖలు చేసిన కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐకు నేడు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా అందరు నిందితులను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.

కోర్టు నిర్ణయం తర్వాత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు.. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏడుస్తూ "కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు..." అని అన్నారు.

మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవా.. 'గత కొన్ని సంవత్సరాలుగా మద్యం కుంభకోణం గురించి బిజెపి మాట్లాడిన తీరు, మాపై చేస్తున్న అన్ని ఆరోపణలను కోర్టు తిరస్కరించింది. నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది' అని అన్నారు.

"న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది.. నిజం గెలిచింది.. ఆప్‌ను నాశనం చేయడానికి అగ్ర నాయకులందరినీ జైలులో పెట్టారు. ఇది పూర్తిగా నకిలీ కేసు. వారు కేజ్రీవాల్ అవినీతిపరుడని చెప్పేవారు. తరువాత ఏడవడం ప్రారంభించిన ఆయ‌న‌.. 'కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు' అని అన్నారు. "నా జీవితంలో నేను నిజాయితీ తప్ప మరేమీ సంపాదించలేదు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఆప్ లు అత్యంత నిజాయితీపరులని కోర్టు పేర్కొంది... మంచి పని చేసి అధికారంలోకి వచ్చి, తప్పుడు కేసులతో మమ్మల్ని జైలులో పెట్టడం ప్రధానమంత్రికి తగదు..." అని ఆయన అన్నారు.

Next Story