స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా మరణించారు. కేన్సర్‌తో దీర్ఘకాలంగా పోరాడుతూ హర్యానాలోని గురుగ్రామ్‌లో గల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేరళలోని టాప్ ఐపీఎస్ అధికారి, ఎస్పీజీ చీఫ్ అరుణ్ కుమార్ సిన్హా బుధవారం కన్నుమూశారు. నాలుగు సంవత్సరాల క్రితం, అతను సెంట్రల్ డిప్యూటేషన్‌పై కేరళను విడిచిపెట్టి, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌కు చీఫ్‌గా నియమించబడ్డాడు. 2016 నుండి ఎస్‌పీజీ చీఫ్‌గా పనిచేస్తున్న అరుణ్ కుమార్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ ప్రధానుల భద్రతకు బాధ్యత వహించాడు. తాజాగా ఆయనకు సర్వీసు పొడిగింపు ఇచ్చారు.
ఈ సంవత్సరం మే 30న ఎస్‌పిజి చీఫ్‌గా సిన్హా పదవీ విరమణ చేయడానికి ఒకరోజు ముందు, పిఎం మోడీ నేతృత్వంలోని అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ (ఎసిసి) అతన్ని మరో ఏడాది పాటు తిరిగి నియమించే ప్రతిపాదనను ఆమోదించింది. సిన్హా 1987లో కేరళ కేడర్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ సర్వీస్ అండ్ ట్రాఫిక్) లో చేరారు. అప్పటి నుండి రాష్ట్రంలో చాలా కీలకమైన పదవులను నిర్వహించారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉన్న సమయంలో అతను సెంట్రల్ డిప్యూటేషన్‌పై వెళ్లి, తరువాత ఎస్‌పీజీ లోకి పోస్ట్ చేయబడ్డాడు. ఆ తర్వాత దానికి అధిపతిగా ఉండగానే మరణించాడు. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన సిన్హాకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.