ఆటో డ్రైవర్‌తో వాగ్వాదం.. గుండెపోటుతో రాజకీయ నేత కుమారుడు మృతి

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్‌తో రాజకీయన నేత కుమారుడు వాగ్వాదానికి దిగాడు.

By Srikanth Gundamalla
Published on : 30 July 2024 1:42 AM

argument, auto driver, political leader son, death , heart attack

ఆటో డ్రైవర్‌తో వాగ్వాదం.. గుండెపోటుతో రాజకీయ నేత కుమారుడు మృతి

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్‌తో రాజకీయన నేత కుమారుడు వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలోనే అతను ఉన్నట్లుండి నేలపై కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని ఫాల్గడ్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీకి చెందిన రఘునాథ్‌ మోరే కుమారుడు.. మిలింద్‌ మోరేకు 45 ఏళ్లు. అతను ఆదివారం తన కుటుంబంతో కలిసి నవపూర్‌లోని రిసార్ట్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వెళ్లే క్రమంలో ఏం జరిగిందో కానీ.. ఆటో డ్రైవర్‌తో వాగ్వాదం చోటుచేసుకుంది. పార్కింగ్‌ విషయంలో గొడవ జరిగిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇద్దరు గొడవ పడ్డారు. కాసేపటికే అక్కడ జనాలు గుమిగూడారు. ఆ తర్వాత మిలింద్ మోరే టెన్షన్‌ కారు వద్దకు వచ్చిదానికి ఆనుకుని నిలబడి ఉన్నారు. ఉన్నట్లు ఒక్కసారిగా నేలపై అతను కుప్పకూలారు. వెంటనే స్పందించిన స్థానికులు, కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. కానీ.. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. గుండెపోటు సంభవించడం వల్లే చనిపోయాడని వైద్యులు నిర్దారించారు.

కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆటో డ్రైవర్‌ అయిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివసేన (యూబీటీ) థానే యూనిట్‌కు మిలింద్ మోరే డిప్యూటీ చీఫ్‌గా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.


Next Story