గుడ్‌న్యూస్‌.. డ్రైవింగ్‌ టెస్ట్‌ లేకుండానే లైసెన్స్‌

Applying for Driving Licence you may be exempted from driving test.డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవ‌డానికి ఇబ్బందులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Feb 2021 5:26 AM GMT
గుడ్‌న్యూస్‌.. డ్రైవింగ్‌ టెస్ట్‌ లేకుండానే లైసెన్స్‌

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవ‌డానికి ఇబ్బందులు ప‌డుతున్నారా..? అయితే మీకో శుభ‌వార్త‌. ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్‌లు పొంద‌వ‌చ్చు. డ్రైవింగ్‌ టెస్ట్‌ లేకుండానే లైసెన్స్‌లు జారీ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసింది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్సుపోర్ట్ అండ్ హైవేస్ డ్రైవర్ ట్రెయినింగ్ కేంద్రాల అక్రిడేషన్ కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. పౌరులకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ట్రైనింగ్‌ సెంటర్లు అనుసరించాల్సిన విధివిధానాలను అందులో నిర్దేశించింది.

ఈ కేంద్రాల్లో శిక్షణ పూర్తిచేసుకున్న వారు డ్రైవింగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రత్యేకించి మళ్లీ డ్రైవింగ్‌ టెస్ట్‌కు హాజరుకావాల్సిన అవసరం లేదని ముసాయిదాలో పేర్కొన్నారు. నాణ్యమైన డ్రైవర్లను తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని, దీని వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయని కేంద్రం తెలిపింది. గత నెల 29న జారీచేసిన ఈ ముసాయిదాను, ప్రజాభిప్రాయం కోసం రవాణా శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 2025 నాటికి రోడ్డు ప్రమాదాలను సగానికి తగ్గించాలని కేంద్ర రవాణా శాఖ లక్ష్యంగా నిర్దేశించుకున్నది. ఇటీవ‌ల‌ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల జాతీయ రోడ్డు భద్రతా మండలి సమావేశంలో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. దీనికి మనమంతా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.


Next Story
Share it