ఆధిక్యంలో నటి భర్త

మహారాష్ట్రలోని అనుశక్తి నగర్ నియోజకవర్గంలో అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన సనా మాలిక్‌పై నటి స్వర భాస్కర్ భర్త, ఎన్‌సిపి నాయకుడు ఫహద్ అహ్మద్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.

By Medi Samrat  Published on  23 Nov 2024 10:12 AM IST
ఆధిక్యంలో నటి భర్త

మహారాష్ట్రలోని అనుశక్తి నగర్ నియోజకవర్గంలో అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన సనా మాలిక్‌పై నటి స్వర భాస్కర్ భర్త, ఎన్‌సిపి నాయకుడు ఫహద్ అహ్మద్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఫహద్ అక్టోబర్‌లో సమాజ్‌వాదీ పార్టీని వీడి NCP (SCP)లో చేరారు.

అనుశక్తి నగర్ నియోజకవర్గం NCP కురువృద్ధుడు నవాబ్ మాలిక్‌కు కంచుకోటగా ఉంది. 2019, 2014, 2009లో నవాబ్ మాలిక్ అనుశక్తి నగర్ సీటును గెలుచుకున్నారు. ఈసారి ఆ స్థానం నుంచి నవాబ్ మాలిక్ కుమార్తె సనాను ఎన్సీపీ బరిలోకి దించింది. నవాబ్ మాలిక్ మన్‌ఖుర్డ్-శివాజీనగర్ స్థానం నుంచి పోటీ చేశారు.

ఫహద్ అహ్మద్ సమాజ్ వాదీ పార్టీ మహారాష్ట్ర యూనిట్ యువజన సభ సమాజ్ వాదీ యువజన సభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, ఫహద్ ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుండి M. ఫిల్ పూర్తి చేశాడు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఫహద్ ఫిబ్రవరి 16, 2023న బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌ను వివాహం చేసుకున్నాడు.

Next Story