ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర చేసే ట్వీట్లు చూస్తే కొన్ని సరదాను, మరికొన్ని ఆలోచింపజేసేవి గానూ ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరూ మాట్లాడుకునే అంశం కరోనా వైరస్. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి కొనసాగుతోంది. శరవేగంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత రెండు రోజులుగా లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనాను అడ్డుకునేందుకు మాస్క్, భౌతిక దూరం పాటించాలంటూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. కొందరు మాత్రం ఇవేమిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
అందుకు ఉదహారణగా ఆనంద్ మహీంద్రా ఓ ఫోటోను పోస్ట్ చేసి భౌతిక దూరానికి షార్ట్ కట్ అంటూ కామెంట్ చేశారు. ఆ ఫోటోలో ఏం ఉందంటే..? ఓ వ్యక్తి ఆఫీసులో గాజు గ్లాస్ లోపల కూర్చొని పని చేసుకుంటున్నాడు. బయటి వారితో మాట్లాడడానికి ఆ గ్లాసుకు ఓ రంద్రం ఏర్పాటు ఉంది. అయితే.. బయటి వ్యక్తి ఒకరు ఆ రంధ్రంలో తలపెట్టి కూర్చొన్న సిబ్బందితో మాట్లాడుతున్నారు. వారి ఇద్దరి మధ్య భౌతిక దూరం ఎలా ఉన్నా కానీ.. కనీసం ఒక్కరికి కూడా మాస్కులు లేవు. మనకు భౌతిక దూరం అలవాటు కాలేదని ఈ ఫోటోను చూస్తే అర్థం అవుతోంది. కానీ మనవంతుగా నిబంధనలు పాటించాల్సిన సమయం ఇది. తలలు వెనక్కి జరిపి.. మాస్కులు ధరించడంది అంటూ ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్ర.