అమృతపాల్ సింగ్ అనుచరుడు పాపాల్ ప్రీత్ అరెస్ట్

ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్ అనుచరుడు పాపాల్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 April 2023 8:00 PM IST
Amritpal Singh, Papalpreet Singh,  Punjab

అమృతపాల్ సింగ్ అనుచరుడు పాపాల్ ప్రీత్ అరెస్ట్ 

ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్ అనుచరుడు పాపాల్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని హోషియాపూర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ సింగ్ మార్చి 18న తప్పించుకుని పారిపోయాడు. అమృతపాల్ సింగ్ తో పాటు ఆయన అనుచరుడు పాపాల్ సింగ్ కూడా పారిపోయాడు. అప్పటి నుంచి పంజాబ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గాలింపు చేపట్టారు. ఇద్దరు కలిసి పారిపోతున్న దృశ్యాలు పలు చోట్ల సీసీటీవీ ఫుటేజీల్లో లభించాయి. గాలింపును పోలీసులు ముమ్మరం చేశారు. హోషియాపూర్ లో పాపాల్ ప్రీత్ సింగ్ తలదాచుకున్నాడనే సమాచారంతో పంజాబ్ పోలీసులు, పంజాబ్ కౌంటన్ ఇంటెలిజెన్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. అమృతపాల్ సింగ్ లొంగిపోబోతున్నాడన్న పుకార్లు, బైసాఖీ వేడుకల నేపథ్యంలో పంజాబ్ పోలీసులు రాష్ట్రం అంతటా నిఘా పెంచారు. పాపల్‌ప్రీత్ అరెస్ట్ కావడంతో అమృతపాల్ కూడా త్వరలో దొరికిపోవడమో, లొంగిపోవడమో జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Next Story