ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఒకరు మృతి, 65 మందికిపైగా అస్వస్థత
Ammonia gas leak in meat factory... woman died, more than 65 people sick. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఆల్ దువా మాంసం ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో
By అంజి Published on 29 Sept 2022 4:18 PM ISTఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఆల్ దువా మాంసం ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో పలువురు స్పృహ తప్పి పడిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఉద్యోగుల సంఖ్య 65కుపైగానే ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. ఉద్యోగుల్లో బాలికలు, మహిళలు, పురుషులు ఉన్నారు. అస్వస్థతకు గురైన దాదాపు 50 మంది మందిని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి తరలించారు. మరికొందరు కూలీలను ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రోరావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అల్ దువా మాంసం ఫ్యాక్టరీకి సంబంధించింది.
గ్యాస్ లీక్‌ను ఆపేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. మొదట గ్యాస్ లీక్ అయినప్పుడు మాంసం ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ విషయాన్ని దాచి పెట్టిందని, ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అధికారులకు సమాచారం అందించారని తెలిసింది. జిల్లా మేజిస్ట్రేట్ ఇందర్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. ఆల్ దువా మీట్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీకేజీ జరిగిందని, దీని కారణంగా చాలా మంది స్పృహ తప్పి పడిపోయారని చెప్పారు. అస్వస్థతకు గురైన వారందరికీ మెరుగైన వైద్యం చేయాలని వైద్యులను జిల్లా అధికారి ఆదేశించారు.
అయితే గ్యాస్ లీకేజీపై విచారణ జరపుతున్నామని, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మధుర బైపాస్ వద్ద ఉన్న ఆల్‌దువా మాంసం ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా అమ్మోనియా గ్యాస్ లీకేజీ అయ్యింది. గ్యాస్ లీక్ కావడంతో ఫ్యాక్టరీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డ పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గ్యాస్ లీకేజీ వల్ల అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌ల నుంచి కొందరు వ్యక్తులు తమ భుజాలపై మోసుకుని ఆసుపత్రి లోపలకు తీసుకెళ్లిన దృశ్యాలు టీవీ ఛానెల్స్‌లో కనిపించాయి.
अलीगढ़
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) September 29, 2022
➡अल दुआ मीट फैक्ट्री में हुआ बड़ा हादसा
➡हाजी जहीर की मीट फैक्ट्री में केमिकल रिसाव
➡जहरीली गैस लीक होने से कर्मचारी हो रहे बेहोश
➡कर्मचारियों में युवती, महिलाएं और पुरुष शामिल
➡जेएन मेडिकल में भारी संख्या में पहुंचे बेहोश कर्मी#Aligarh pic.twitter.com/Gk6HeFmuZ8