'అనుమతి లేకుండా అమితాబ్ పేరు, ఫొటో వాడకూడదు'.. హైకోర్టు ఆదేశాలు

Amitabh Bachchan's name, voice, pic can't be used without permission.. Delhi HC. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్.. తన పేరు, ఇమేజ్, వాయిస్, వ్యక్తిత్వ హక్కులను రక్షించాలని కోరుతూ

By అంజి  Published on  25 Nov 2022 8:12 AM GMT
అనుమతి లేకుండా అమితాబ్ పేరు, ఫొటో వాడకూడదు.. హైకోర్టు ఆదేశాలు

ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్.. తన పేరు, ఇమేజ్, వాయిస్, వ్యక్తిత్వ హక్కులను రక్షించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. బాలీవుడ్ మెగాస్టార్ తరపున ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే హాజరయ్యారు. తన పర్మిషన్‌ లేకుండా కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో నకిలీ లాటర్ స్కామ్, మరే ఇతర సంస్థ, వ్యక్తులు వాడుకోకుండా నిరోధించాలని, తన ప్రచార హక్కులను కాపాడాలని పిటిషన్‌లో అమితాబ్ కోరారు. అమితాబ్‌ బచ్చన్ వ్యక్తిగత హక్కులు, ప్రచార హక్కులను ఉల్లంఘించే వ్యక్తులపై నిషేధం విధిస్తూ జస్టిస్ నవీన్ చావ్లా శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

కొందరు ప్రముఖ నటుడు అమితాబ్‌ సెలబ్రిటీ హోదాను ఆయన అనుమతి, ధ్రువీకరణ లేకుండానే తమ సొంత వ్యాపారాలను ప్రచారం చేసుకునేందుకు ఉపయోగించుకుంటున్నారని జస్టిస్ చావ్లా పేర్కొన్నారు. "అమితాబ్‌ కోలుకోలేని నష్టాన్ని, హానిని చవిచూసే అవకాశం ఉంది. కొన్ని కార్యకలాపాలు అతనికి చెడ్డపేరును కూడా తీసుకురావచ్చు. పైన పేర్కొన్న వాటిని దృష్టిలో ఉంచుకుని మధ్యంతర ఉత్తర్వు జారీ చేయబడింది" అని జస్టిస్ చావ్లా పేర్కొన్నారు. ఈ కేసులో అమితాబ్ చెబుతున్నట్టు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు.

అమితాబ్ తరఫున న్యాయవాది హరీష్ సాల్వే కోర్టులో వాదనలు వినిపించారు. కౌన్ బనేగా కరోడ్ పతి లాటరీ లక్కీ డ్రా, కౌన్ బనేగా కరోడ్ పతి లాటరీ రిజిస్ట్రేషన్, అమితాబచ్చన్ వీడియో కాల్ తదితర రూపంలో ప్రచారం కోసం వినియోగిస్తున్న ఆధారాలను కోర్టుకు సమర్పించారు. అమితాబ్‌ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉన్న కంటెంట్‌ను తొలగించాలని ఐటీ శాఖ అధికారులు, టెలికాం సర్వీస్‌ ప్రోవైడర్లను కోర్టు కోరింది. అమితాబ్‌ పేరు, ఇమేజ్‌, స్వరాన్ని ఎవరూ ఉపయోగించకూడదని కోర్టు స్పష్టం చేసింది.

Next Story
Share it