కరోనాని క్యాష్ చేసుకుంటున్న అంబులెన్స్ డ్రైవర్లు.. 40 కిలోమీటర్లకు రూ.17 వేలు
Ambulance Driver charged RS.17000 for distance of 40 km.కరోనా వైరస్‌తో ప్రజలు అల్లాడిపోతున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 2 Jun 2021 8:02 AM GMT
కరోనా వైరస్‌తో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ వైపు వైరస్ విజృంభిస్తుండడంతో దాదాపు ఆస్పత్రులన్ని కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఇదే అదునుగా బావించిన అంబులెన్స్ డ్రైవర్లు కరోనాని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. కొంత దూరానికే భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. మొన్న రాజస్థాన్‌లో 85కిలోమీటర్లు దూరంలో ఉన్న గ్రామానికి యువతి మృతదేహాన్ని తరలించడానిక రూ.35వేలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అంత ఇచ్చుకోలేని ఆ తండ్రి తన కుమారై మృతదేహాన్ని కారు ముందు సీటులో పెట్టుకుని వెళ్లిన ఘటనను మరువక ముందే పశ్చిమ బెంగాల్‌లో అలాంటి ఘటననే చోటు చేసుకుంది.
బెంగాల్‌లోని అసన్‌సోల్ ప్రాంతంలో సుభోదీప్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడి తండ్రి అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో అతడిని అసన్‌సోల్ నుంచి దుర్గాపూర్‌కు దాదాపు 40 కిలోమీటర్లు అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. ఆస్పత్రికి చేరుకున్న తరువాత అంబులెన్స్ డ్రైవర్.. సుభోదీప్‌కు ఊహించని షాక్ ఇచ్చాడు. రూ.17వేలు చార్జ్ చేశాడు. చేసేది ఏమీ లేక అతడు అడిగిన మొత్తం ఇచ్చేశాడు. కాగా.. అంబులెన్స్ ఆపరేటర్ దోపిడీపై అనుదీప్ మీడియాను ఆశ్రయించాడు. అలాగే.. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన అధికారికి ఫిర్యాదు కూడా చేశాడు. కష్టకాలం ఉంటే ఇలాంటి దోపిడీ ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు.