కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. అమర్‌నాథ్ బోర్డుతో చర్చలు జరిపిన తరువాత ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక వచ్చే ఏడాదే అమర్ నాథ్ యాత్ర ఉంటుందని చెప్పారు. అయితే.. అయితే భక్తుల సౌకర్యార్థం అమర్‌నాథ్ లింగాన్ని ఆన్‌లైన్‌లో దర్శనం చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. భక్తులందరూ తమ తమ ఇళ్లలోనే ఉండి, సౌకర్యవంతంగా, క్షేమంగా మంచు లింగాన్ని దర్శించుకోవచ్చని సూచించారు.
3,880 మీటర్ల ఎత్తులో ఉండే పరమశివున్ని దర్శించుకునేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా జూన్ మాసంలో అమర్‌నాథ్ యాత్రికులకు అనుమతి ఇస్తుంటుంది. దాదాపు 56 రోజుల పాటు యాత్ర చేసి భక్తులు మంచు రూపంలో ఉండే పరమశివుడిని దర్శించుకుంటారు. ఈ యాత్రకు రెండు దారులు ఉన్నాయి. ఒకటి పహల్గమ్, రెండు బల్తాల్. ఈ తీర్థ యాత్రను కొవిడ్ కారణంగా 2020లోనూ క్యాన్సిల్ చేశారు.