టీనేజర్ల అంగీకార శృంగార కేసుల్లో పోక్సో చట్టం దుర్వినియోగం: అలహాబాద్ కోర్టు
టీనేజర్ల అంగీకార శృంగార సంబంధాలకు సంబంధించిన కేసుల్లో పోక్సో చట్టం దుర్వినియోగం అవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
By Srikanth Gundamalla Published on 6 July 2024 11:15 AM ISTటీనేజర్ల అంగీకార శృంగార కేసుల్లో పోక్సో చట్టం దుర్వినియోగం: అలహాబాద్ కోర్టు
అలహాబాద్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు టీనేజర్ల మధ్య అంగీకార శృంగార సంబంధాలకు సంబంధించిన కేసుల్లో పోక్సో చట్టం దుర్వినియోగం అవుతోందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 18 ఏళ్ల అమ్మాయితో పారిపోయిన పెళ్లి చేసుకున్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేసిన అలహాబాద్ కోర్టు ఈ తరహా వ్యాఖ్యలు చేసింది. పోక్సో చట్టం కిందకు వచ్చే కేసులు, ఏకాభిప్రాయ సంబంధాలకు సంబంధించిన వాటి మధ్య తేడాను గుర్తించడం సవాలుగా ఉందని జస్టిస్ క్రిషన్ పహల్ అన్నారు.
పోక్సో చట్టం కింద 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను లైంగికంగా వేధింపుల నుంచి రక్షించడమే. అది దుర్వినియోగం చేయబడిన సందర్భాలు చాలా ఉన్నాయంటూ అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. యుక్తవయసులో ఉన్నవారి మధ్య ఏకాభిప్రాయంతో కూడిన శృంగార సందర్భాలే అంటూ పేర్కొంది. న్యాయం సముచితంగా అందేలంటే సూక్ష్మ పరిశీలన అవసరం అంటూ అభిప్రాయపడింది.
కాగా.. నిందితుడు సతీష్ అలియాస్ చంద్‌కు ఇటీవల అలహాబాద్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. మైనర్‌ను ప్రలోభపెట్టాడంటూ బాలిక తండ్రి కేసు వేశాడు.. ఈ కేసు 2023 జూన్ 12న నమోదు అయ్యింది. సతీష్‌పై కిడ్నాప్‌తో పాటు బలవంతంగా వివాహం చేసకోవడం, రేప్ వంటి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. డియోరియా జిల్లాలోని బరాహాజ్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలహాబాద్ కోర్టులో ఇటీవల విచారణ జరగ్గా.. నిందితుడు తరఫు న్యాయవాది.. తన క్లయింట్‌ను తప్పుడు కేసులో ఇరికించారని వాదించారు. బాధితురాలుగా పేర్కొన్న యువతి వయసు ఇప్పుడు 18 ఏళ్లు అనీ.. ఆమె వివాహానికి సమ్మతించిందని పేర్కొన్నారు. ఒకరినొకరు ప్రేమించుకున్టన్లు చె్పారు. తల్లిదండ్రులకు భయపడి పారిపోయి గుళ్లో పెళ్లి చేసుకున్నారనీ.. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారని కోర్టు తెలిపారు సతీష్ తరఫు లాయర్.
దాంతో.. యువతి అంగీకారంతోనే వివాహం జరిగిందనీ.. పోక్సో చట్టం ఇలాంటి సందర్భాల్లో దుర్వినియోగం అవుతోందని అలహాబాద్ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మేరకు నిందితుడు సతీష్‌కు బెయిల్ ఇచ్చింది.