దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై మహానగరంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో సర్వర్లు ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. దీంతో గురువారం సాయంత్రం ఎయిర్‌పోర్టులోని టెర్మినల్ 2లో అన్ని వ్యవస్థలు ఆగిపోయాయి. చెక్ ఇన్, లగేజ్ కోసం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్లు ఒక్కసారిగా ఆగిపోవడంతో కంప్యూటర్లు పని చేయడం లేదు. దీంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆఫ్‌లైన్ పద్ధతిని పాటిస్తున్నారు. దీని కారణంగా ప్రయాణికులు గంటల పాటు క్యూ లైన్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాలు ఆలస్యం కావడంతో ఎయిర్‌పోర్టులో గందరగోళం నెలకొంది. మరోవైపు ఇబ్బందులు ఎదుర్కొన్న విమాన ప్రయాణికులు తమ ఆవేదనను ట్విట్టర్ వేదికగా చెబుతున్నారు. చెక్ ఇన్ కౌంటర్ వద్ద తన బ్యాగ్‌ను ఉంచిన వెంటనే సిస్టమ్ క్రాష్ అయిందని ఓ మహిళ ప్రయాణికులు పేర్కొంది. మరోవైపు ప్రయాణికుల ఇబ్బందిపై ఎయిర్ ఇండియా స్పందించింది. వారికి ఎదురైన అసౌకర్యాన్ని నివారించేందుకు తమ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ట్వీట్ చేసింది.