సంచలన రీతిలో నిరాహార దీక్షకు దిగిన సోనమ్ వాంగ్‌చుక్

All is not well in Ladakh: Sonam Wangchuk.'3 ఇడియట్స్' చిత్రం చూశారు కదా.. ఆ సినిమాలో అమీర్ ఖాన్ పోషించిన పాత్ర సోనమ్ వాంగ్‌చుక్ దే.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Jan 2023 12:17 PM IST
సంచలన రీతిలో నిరాహార దీక్షకు దిగిన సోనమ్ వాంగ్‌చుక్

'3 ఇడియట్స్' చిత్రం చూశారు కదా.. ఆ సినిమాలో అమీర్ ఖాన్ పోషించిన పాత్ర సోనమ్ వాంగ్‌చుక్ దే..! లడఖ్ లో ప్రస్తుతం పర్యావరణ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెబుతున్నారు. అక్కడి పర్యావరణం పూర్తిగా దెబ్బతిందని.. వాతావరణ సమస్యలపై గణతంత్ర దినోత్సవం నుండి ఐదు రోజుల పాటూ నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ నిరాహార దీక్షతో లడఖ్ ప్రాంతంలోని వాతావరణ గురించి ప్రభుత్వం, భారతదేశ పౌరుల దృష్టికి తీసుకుని వెళ్లాలని భావిస్తున్నాడు.

సోనమ్ వాంగ్‌చుక్ తో మా బృందం మాట్లాడింది.. ఆయన అక్కడి సమస్యల గురించి పలు విషయాలు తెలిపారు.

లడఖ్ లోని సమస్యల గురించి మాకు చెప్పగలరా?

‘All is not well in Ladakh. Ladakh ki Mann ki Baat,’ అంటూ ఓ వీడియోను సోనమ్ అప్లోడ్ చేశారు. నా వీడియోలో నేను చెప్పినట్లు లడఖ్‌లో పరిస్థితులు ఏమంత బాగాలేవని అన్నారు. లడఖ్ లోని వాతావరణం, పర్యావరణం గురించి ప్రజలకు తెలియాలి. ఈ భూమి తనను కాపాడమని కోరుతోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా లడఖ్ ఉన్న హిందూ కుష్ హిమాలయన్ శ్రేణిలో హిమానీనదాలను కరిగిపోతున్నాయి. దీంతో జిల్లాలో నీటి ఎద్దడి నెలకొంది. ఈ విషయంలో, మా నాయకులు ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించారు, కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత ఇక్కడి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కానీ అధికారులు ఏమీ మాట్లాడడంలేదు.

వాతావరణంలో వస్తున్న మార్పులపై మీరు ఏమి చెప్పాలని అనుకుంటూ ఉన్నారు..?

లడఖ్ లో వస్తున్న వాతావరణ మార్పుల గురించి ప్రభుత్వం, ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మేము ఎదుర్కొంటున్న వాతావరణ సవాళ్లకు వారిని బహిర్గతం చేస్తున్నాము. హిమానీనదాల జీవావరణ శాస్త్రం ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి, నేను -40°C ఉష్ణోగ్రతలో 18,000 అడుగుల ఎత్తులో ఉండే ఖర్దుంగ్లా పాస్ వద్ద ఉన్న హిమానీనదాల వద్ద ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నాను.

5 రోజుల ఉపవాస కార్యక్రమానికి మీతో ఎవరు చేరనున్నారు?

లడఖ్ వాసులే కాకుండా.. దేశం మొత్తం నుండి చాలా మంది ప్రజలు తమ సంఘీభావాన్ని తెలియజేయనున్నారు. అంతేకాకుండా పలువురు నాతో కలిసి ఉపవాసం చేస్తామని చెప్పారు.. కానీ ఇది చాలా పెద్ద ప్రమాదం కాబట్టి నేను ఒంటరిగానే ఉపవాసం చేస్తాను. అయితే తన ఉపవాసం గురించి ప్రజలు ప్రధాని దగ్గరకు తీసుకుని వెళ్లాలని మాత్రం కోరుకుంటూ ఉన్నాను. మా విజ్ఞప్తులు ప్రధానమంత్రికి చేరేలా చూసేందుకు జనవరి 26న ఇళ్లు, పాఠశాలలు, కాలేజీలు దగ్గర ఉపవాసం ఉండి తమ మద్దతును తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను.

జనవరి 26న క్లైమేట్ ఫాస్టింగ్ ప్రారంభించాలని మీరు ఎందుకు నిర్ణయించుకున్నారు?

భారతదేశం తన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు రిపబ్లిక్ డే. లడఖ్‌లో దాదాపు 95% గిరిజన జనాభా ఉంది. లడఖ్‌ను 6వ షెడ్యూల్‌లో చేర్చడం గురించి మా నాయకులతో చర్చించాలని నేను కోరుకుంటున్నాను.

ఈ వాతావరణ మార్పులు లడఖ్ ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి?

కొన్ని గ్రామాల మీద ఇప్పటికే వాతావరణం తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా మంది ప్రజలు శరణార్థులుగా మారుతున్నాయి. ప్రజలు తమ గ్రామాలను విడిచిపెడుతున్నారు. ఇప్పుడు మాకు ఎటువంటి రక్షణ ఇవ్వకపోతే, పరిశ్రమలు, మైనింగ్‌ కంపెనీలు ఇక్కడకు వచ్చేస్తాయి. ఇది చాలా భయాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం మేము నీటి సవాళ్లను, అప్పుడప్పుడు ఆకస్మిక వరదలను ఎదుర్కొంటున్నాము. అయితే అది తీవ్రమైతే వినాశనానికి దారితీస్తుందని మాత్రం చెప్పగలను.

లడఖ్ ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం కదా.. 6వ షెడ్యూల్ అంటే ఏమిటి..?

భారత రాజ్యాంగం లోని 6వ షెడ్యూల్ ప్రకారం ఒక ప్రాంతంలో 50% గిరిజన జనాభా కోసం చూస్తుంది. లడఖ్‌లో 95% జనాభా గిరిజనులే ఉండడంతో త్వరలో ఆ లిస్టులో చేర్చే అవకాశాలు ఉన్నాయి. గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా కూడా హామీ ఇచ్చారు. కేంద్ర పాలిత ప్రాంతం కావాలనే 70 ఏళ్ల డిమాండ్‌కు సమాధానం చెప్పిన ప్రభుత్వం ఈ డిమాండ్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

'డబ్బులను ఖర్చు పెడుతున్నామని భావించడం కంటే వారి జీవనశైలిని సర్దుబాటు చేసుకోవాలి' అనే వ్యాఖ్యలు చేయడానికి కారణమేమిటి..?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు పర్యావరణం గురించి పట్టించుకోరు. చాలా అజాగ్రత్తగా జీవిస్తున్నారు, దీని ఫలితంగా వచ్చే ఉద్గారాలు మా జీవనాధారమైన మన హిమానీనదాలను కరిగిస్తున్నాయి. మనం ఎదుర్కొంటున్న వాతావరణ సవాళ్లపై ప్రజలు కూడా దృష్టి పెట్టాలి, అందుకే నేను ఈ నిరాహార దీక్ష చేస్తున్నాను. ప్రజల జీవన విధానం ఈ సమస్యలకు కారణమవుతోంది. వారు అనేక పర్యావరణ సమస్యలను కలిగించే విధంగా వారి జీవితాలను గడుపుతారు. పర్వతాలలో, తీర ప్రాంతాలలో ఉన్న మాలాంటి వాళ్లు వాతావరణ మార్పులకు మొదటి బాధితులు అవుతున్నాము.

మీరు భారతదేశ ప్రజలకు, భారత ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తి ఏమిటి..?

ప్రభుత్వం బాధ్యత వహించాలి. లడఖ్ వంటి ప్రాంతాలను పెట్టుబడిదారీ విధానం నుండి రక్షించాలని నేను కోరుకుంటున్నాను. భారతదేశ పౌరులు మరింత బాధ్యతాయుతంగా జీవించాలని, వారి జీవనశైలిని మార్చుకోవాలని, పర్యావరణాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను.

Next Story