కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న ఆ మాజీ క్రికెటర్‌కు అక్షయ్ సాయం..
Akshay Kumar donates Rs 1 crore to Gautam Gambhir Foundation. అక్షయ్.. తాజాగా కరోనా వైరస్ నియంత్రణ కోసం కృషి చేస్తున్న మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థకు రూ. కోటి విరాళం
By Medi Samrat Published on 25 April 2021 9:57 AM GMT
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.. తెర మీద కథానాయకుడిగా ఎంత ప్రసిద్దో.. రియల్ లైఫ్‌లోనూ ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూ రియల్ హీరోగా అంతే ప్రసిద్ది. ఎన్నో సార్లు ఆపద అన్నవారికి ఆపన్నహస్తం అందించి ఉదారతను చాటుకున్న అక్షయ్.. తాజాగా కరోనా వైరస్ నియంత్రణ కోసం కృషి చేస్తున్న మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థకు రూ. కోటి విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నాడు.
These are really tough times, @GautamGambhir. Glad I could help. Wish we all get out of this crisis soon. Stay Safe 🙏🏻
అక్షయ్ చేసిన సాయంపై సంతోషం వ్యక్తం చేసిన గంభీర్.. అతనికి కృతజ్ఞతలు తెలియజేశాడు. అక్షయ్ ఇచ్చింది డబ్బులు మాత్రమే కాదు.. ఎంతో మంది జీవితాలకు భరోసాను కల్పించారని అన్నారు. అక్షయ్ ఇచ్చిన డబ్బును మా ఫౌండేషన్ ద్వారా ఆక్సీజన్, ఫుడ్, మెడిసిన్ వంటి వాటికి వినియోగించి.. అవరసరమైన వారికి అందజేస్తాం అని అన్నాడు గంబీర్. ఇక గంభీర్ చేసిన ట్వీట్‌పై అక్షయ్ మరలా స్పందించారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో నా వంతు సాయం చేయడం సంతోషంగా అనిపిస్తుందని అన్నారు. త్వరలోనే ఈ సంక్షోభం నుండి బయటపడతామని ఆశిస్తున్నానని అక్షయ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.