ఘోర విమాన ప్రమాదం.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఆరుగురు దుర్మరణం
మహారాష్ట్రలోని బారామతిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఆరుగురు మృతి చెందినట్టు డీజీసీఏ ప్రకటించింది.
By - అంజి |
ఘోర విమాన ప్రమాదం.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఆరుగురు దుర్మరణం
మహారాష్ట్రలోని బారామతిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఆరుగురు మృతి చెందినట్టు డీజీసీఏ ప్రకటించింది. వారిలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు అధికారులు ఉన్నట్టు తెలిపింది. ఉదయం 8.456 గంటలకు ప్రమాదం జరిగినట్టు పేర్కొంది. కాగా ఈ దుర్ఘటనలో విమానం కాలి బూడిదైంది. అక్కడి దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. విషయం తెలిసిన వెంటనే అజిత్ కుటుంబం ఢిల్లీ నుంచి బారామతికి బయలుదేరింది.
బుధవారం ఉదయం చార్టర్డ్ విమానం బారామతి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా జరిగిన ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. జిల్లా పరిషత్ ఎన్నికలకు ముందు నాలుగు బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి అజిత్ పవార్ బారామతికి వెళుతుండగా, ముంబై నుండి చార్టర్డ్ చేయబడిన బాంబార్డియర్ లియర్జెట్ 45 విమానం కూలిపోయింది.
The first footage from Baramati, Maharashtra, shows the site where Deputy Chief Minister Ajit Pawar’s aircraft crashed earlier today. Local authorities are investigating, and further information is awaited#AjitPawar | #PlaneCrash pic.twitter.com/BybFz1jgRa
— Vishal (@VishalMalvi_) January 28, 2026
విమానం మొత్తం బూడిదగా మారింది, విమానం పూర్తిగా ముక్కలైపోయి , శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బారామతి ప్రాంతం నుండి భారీ మంటలు, పొగలు ఎగసిపడుతున్నట్లు ప్రాథమిక దృశ్యాలు చూపించాయి.
#WATCH | Delhi | Maharashtra Deputy CM Ajit Pawar passes away in a charter plane crash in Baramati; Visuals from ANI Archives Ajit Pawar, Deputy CM of Maharashtra, was onboard along with 2 more personnel (1 PSO and 1 attendant) and 2 crew (PIC+FO) members in the charter plane.… pic.twitter.com/pzJ12LvcQT
— ANI (@ANI) January 28, 2026