పంటపొలాల్లో కుప్పకూలిన శిక్షణ విమానం..
Aircraft crashes in Bhopal.పంటపొల్లాల్లో ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని ముగ్గురు పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారు.
By తోట వంశీ కుమార్ Published on
28 March 2021 7:39 AM GMT

పంటపొల్లాల్లో ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు విమానంలోని ముగ్గురు పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో రాజధాని భోపాల్‌లో జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. శనివారం మధ్యాహ్నం భోపాల్ నుంచి గుఫా వైపు శిక్షణా విమానం బయలుదేరింది. ఈ క్రమంలో బద్వాయి ప్రాంతంలోని బిషన్ కేడి గ్రామంలోని పొలాల్లో విమానం కుప్పకూలినట్లు సమాచారం అందిందని వెల్లడించారు. ఈ ఘటనలో ముగ్గురు పైలర్లు గాయపడ్డారని వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.
ఇంజిన్ వైఫల్యం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాద సమయంలో విమానంలో కెప్టెన్ అశ్వినీ శర్మతో పాటు ఇద్దరు ట్రెయినీ పైలట్లు ఉన్నారు. గాయపడిన పైలట్లను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు గాంధీ నగర్ ఎస్‌హెచ్‌ఓ అరుణ్ శర్మ తెలిపారు. విమానం కుప్పకూలిన తర్వాత మంటలు చెలరేగి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని వెల్లడించారు. విమానం కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Next Story