బ్యాగ్‌లో బాంబు ఉందా? అని ఎయిర్‌పోర్టులో అడిగిన ప్రయాణికుడి అరెస్ట్
కొచ్చి ఎయిర్‌పోర్టులో చెక్ పాయింట్ వద్ద ఓ ప్రయాణికుడిని అధికారులు అరెస్ట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 11 Aug 2024 1:30 PM ISTబ్యాగ్‌లో బాంబు ఉందా? అని ఎయిర్‌పోర్టులో అడిగిన ప్రయాణికుడి అరెస్ట్
ఆదివారం ఉదయం కొచ్చి ఎయిర్‌పోర్టులో ఎక్స్‌రే బ్యాగేజ్ ఇన్‌స్పెక్షన్ సిస్టమ్ చెక్ పాయింట్ వద్ద ఓ ప్రయాణికుడిని అధికారులు అరెస్ట్ చేశారు. చెకింగ్ సమయంలో అతను సీఐఎస్‌ఎఫ్ అధికారంతో చేసిన ఒక కామెంట్ కారణంగా అధికారులు అదుపులోకి తీసుకుని మరీ విచారిస్తున్నారు.
42 ఏళ్ల వయసు ఉన్న మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఎయిరిండియా విమానంలో కొచ్చి నుంచి ముంబైకి వెళ్లాల్సి ఉంది. అయితే.. ఎయిర్‌పోర్టుకు వెళ్లిన మనోజ్ కుమార్.. ప్రీ-ఎంబార్కేషన్ సెక్యూరిటీ చెక్ సమయంలో.. సీఐఎస్‌ఫ్ అధికారితో ఇలా అన్నాడు. 'నా బ్యాగ్‌లో ఏదైనా బాంబు ఉందా?' అనరి అడిగాడు. అంతే.. అప్రమత్తం అయిన సీఐఎస్‌ఎఫ్ అధికారులు మనోజ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతను చేసిన వ్యాఖ్యతో ఆందోళన రేకెత్తిందని అధికారులు పేర్కొన్నారు.ఈ అందుకే భద్రతా బృందాలకు సదురు CISF అధికారి సమాచారం ఇవ్వడంతో మనోజ్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. విమానాశ్రయంలోని అధికారులు బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను పిలిచి పూర్తిగా తనిఖీ చేయించారు కూడా. అవసరమైన తనిఖీలన్నీ పూర్తి చేసిన తర్వాత ఎయిరిండియా విమానాన్ని నిర్ణీత సమయంలోనే టేకాఫ్ తీసుకునేలా చూశామన్నారు ఎయిర్‌పోర్టు అధికారులు. కాగా.. మనోజ్ కుమార్‌ను మాత్రం తదుపరి విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.