అబుదాబికి నేరుగా విమానాలు.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిర్ణయం

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బెంగళూరు నుండి అబుదాబికి నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది.

By అంజి
Published on : 24 July 2024 8:45 AM

Air India Express, Flight, Bengaluru To Abu Dhabi

అబుదాబికి నేరుగా విమానాలు.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిర్ణయం 

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బెంగళూరు నుండి అబుదాబికి నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. ఇది బెంగళూరు నగరం నుండి ఎయిర్ ఇండియా మొదటి అంతర్జాతీయ సర్వీసుగా నిలిచింది. విమానయాన సంస్థ ప్రకటన ప్రకారం.. మంగళ, గురు, శని, ఆదివారాల్లో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) నుంచి మధ్యాహ్నం 3.25 గంటలకు అంతర్జాతీయ విమాన సర్వీసు షెడ్యూల్ చేశారు. ఈ విమానం సాయంత్రం 6 గంటలకు అబుదాబి చేరుకుంటుంది.

కొత్త విమాన సేవలను ప్రారంభించడంతో.. అయోధ్య, భువనేశ్వర్, చెన్నై, గోవా, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, లక్నో, పూణే, విశాఖపట్నం వంటి నగరాల నుండి విమాన ప్రయాణికులు ఇప్పుడు అబుదాబికి వన్-స్టాప్ ప్రయాణాల ద్వారా కనెక్ట్ కావచ్చని ఎయిర్‌లైన్ తెలిపింది. భారతదేశం యొక్క IT రాజధానిగా పరిగణిస్తున్న బెంగళూరు నుండి ఇప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ వారానికి 200 విమానాల సర్వీసులను కలిగి ఉంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్‌లైన్ అతిపెద్ద స్టేషన్‌గా మారింది.

Next Story