కుప్ప‌కూలిన మిగ్‌-21 యుద్ధ‌ విమానం.. కెప్టె‌న్ మృతి

Air Force Pilot Killed In MiG-21 Bison Accident During Training Mission.భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కి చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానం బుధ‌వారం కుప్ప‌కూలింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2021 9:44 AM GMT
Air Force Pilot Killed In MiG-21 Bison Accident During Training Mission

భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కి చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానం బుధ‌వారం కుప్ప‌కూలింది. గ్వాలియ‌ర్ ఎయిర్‌ఫోర్స్‌లో స్టేష‌న్‌లో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో భార‌త వాయుసేన‌కు చెందిన గ్రూప్ కెప్టెన్ ఎ.గుప్తా మృతి చెందారు. భార‌తీయ వైమానిక ద‌ళం ఓ ప్ర‌క‌ట‌న‌లో ఈ విష‌యాన్ని చెప్పింది. 'ఈ ఘోర ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ ఎ. గుప్త ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతి పట్ల ఐఏఎఫ్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది. బాధిత కుటుంబ సభ్యులకు అండగా నిలబడతాం. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే విచారణకు ఆదేశించాం..' అని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది.

కాగా.. గ‌త 18 నెల్లో మిగ్‌-21శ్రేణి విమానాలు ప్ర‌మాదానికి గురికావ‌డం ఇది మూడోసారి. 2019 సెప్టెంబ‌ర్‌లో ఇదే ఎయిర్ బేస్‌లో మిగ్ 21 ప్ర‌మ‌దానికి గురైంది. ఈ ప్ర‌మాదాల్లో భార‌త్ విమానాల‌ను న‌ష్ట‌పోవ‌డంతో పాటు అత్యంత విలువైన ఫైట‌ర్ ఫైల‌ట్ల‌ను కూడా కోల్పోతోంది.

బ‌య‌ట‌ప‌డటం అంత తేలిక కాదు..

యుద్ద విమానాలు కూలిపోతాయి అని తెలిసిన‌ప్పుడు ఫైల‌ట్ దానిని ల్యాండ్ చేయ‌డానికి చివ‌రి వ‌ర‌కూ ప్ర‌య‌త్నిస్తాడు. ఇక త‌ప్ప‌దు అనుకున్న‌ప్పుడు విమానం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తారు. దీనికి పైల‌ట్ సీటు కింద రాకెట్ ఇంజిన్ వంటి ఓ వ్య‌వ‌స్థ ఉంటుంది. తొలుత పైల‌ట్ పైన ఉన్న గ్లాస్‌ను తొల‌గిస్తారు. అనంత‌రం ఆ రాకెట్ వ్య‌వ‌స్థ ప‌నిచేసి ఫైల‌ట్ అత్యంత వేగంతో గాల్లోకి ఎగిరిపోతాడు. ఆ త‌రువాత అత‌డి నుంచి సీటు వేర‌వుతుంది. అత‌నికి ఉన్న ఫారాచూట్ తెరుచుకుని కింద‌కు దిగుతాడు. ఈ ప్ర‌క్రియ అత్యంత వేగంగా జ‌రిపోవాలి. ఏ మాత్రం ఆల‌స్య‌మైనా గాల్లో ప్ర‌యాణిస్తున్న ఆ యుద్ద విమానం తోక‌భాగం ఫైల‌ట్ శ‌రీరాన్ని తాకుతుంది. దీంతో పాటు త‌గినంత ఎత్తులో ఎజెక్ట్ కాక‌పోతే పారాచూట్ తెరుచుకునే స‌మ‌యం ల‌భించ‌క నీటిలో లేదా నేల‌పై ప‌డిపోతాడు.




Next Story