మిజోరంలో స్వైన్ ఫ్లూ ఉద్ధృతి
African Swine Fever in mizoram.ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ మిజోరంలో కొత్త టెన్షన్ క్రియేట్ చేస్తుంది. పందుల్లో ఈ
By తోట వంశీ కుమార్ Published on 2 Jun 2021 11:01 AM ISTఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ మిజోరంలో కొత్త టెన్షన్ క్రియేట్ చేస్తుంది. పందుల్లో ఈ వ్యాధి ప్రబలడంతో గత కొద్ది రోజులుగా అవి భారీ సంఖ్యలో మరణిస్తున్నాయి. మార్చి 21 నుంచి మే 31 మధ్య.. అంటే కేవలం రెండు నెలల 10 రోజుల సమయంలోనే మిజోరంలో 4,832 పందులు స్వైన్ ఫీవర్ బారిన పడి చనిపోయాయని ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వెల్లడించింది. దీంతో ఆ రాష్ట్ర రైతులకు రూ.19 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పశుసంవర్థక శాఖ జేడి తెలిపారు. ఇప్పటివరకు మిజోరంలోని 9 జిల్లాల్లో స్వైన్ ఫీవర్ కేసులు వెలుగుచూశాయి. వీటి పరిధిలోని 91 గ్రామాలను స్వైన్ ఫీవర్ ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు.
లంగ్సెన్ జిల్లాలో మార్చి 25న తొలి కేసును గుర్తించారు. అనంతరం అన్ని జిల్లాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ మోహరించారు. లంగ్సెన్ను ఇన్ఫెక్టెడ్ జోన్‌గా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అనౌన్స్ చేసింది. ఆ జిల్లాలోని 26 గ్రామాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో మొత్తం 31,108 పందులు ఉన్నాయని సమాచారం. ఏఎస్ఎఫ్ ప్రబలని ప్రాంతాల్లోనూ 100 వరకు పందులు చనిపోయాయి. మిజోరంలో ఇలాంటి వ్యాధి ప్రబలడం ఇదే తొలిసారి కాగా.. పందులను పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణంగా అధికారులు బావిస్తున్నారు. ఈ వ్యాధితో మనుషులకు ఎలాంటి ముప్పు ఉండదని, పందు నుంచి ఇది మనుషులకు సోకే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు.