బంగ్లాదేశ్ భారత పర్యటనపై రాజకీయ కలకలం
సెప్టెంబరు 19 నుంచి చెన్నైలో భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు మ్యాచ్ జరగనుంది
By Medi Samrat Published on 18 Sep 2024 7:14 AM GMTసెప్టెంబరు 19 నుంచి చెన్నైలో భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో గెలిచి ఈ సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. ఈ టెస్ట్ మ్యాచ్ ఏర్పాట్లపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే క్రికెట్ మ్యాచ్‌పై ప్రశ్నలు సంధించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన అఘాయిత్యాల నేపథ్యంలో.. ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బీసీసీఐపై ప్రశ్నలు సంధించారు.
బంగ్లాదేశ్‌లో హిందూ సమాజం హింసను ఎదుర్కొంటుండగా.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును భారతదేశంలో పర్యటించడానికి ఎందుకు అనుమతిస్తున్నారని శివసేన నాయకుడు ఆదిత్య థాకరే కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐని ప్రశ్నించారు. BCCI బంగ్లా జట్టుకు ఆతిథ్యం ఇస్తుంటే.. బంగ్లాదేశ్‌లో మాత్రం హింస పేరుతో భారత్‌పై ట్రోల్స్ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని థాకరే ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేశారు. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు భారత పర్యటనలో ఉందని.. బంగ్లాదేశ్‌లో గత 2 నెలలుగా హిందువులు హింసను ఎదుర్కొంటున్నారని కొన్ని మీడియా ఛానళ్లు, సోషల్ మీడియా ద్వారా మేము తెలుసుకున్నాము. ఇది నిజమైతే.. హిందువులు, ఇతర మైనారిటీలు అక్కడ హింసను ఎదుర్కొన్నట్లయితే.. బీజేపీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం బీసీసీఐ పట్ల ఎందుకు మెతకగా ఉంది.. పర్యటనను ఎందుకు అనుమతిస్తోంది? అని ప్రశ్నించారు.