'ఎమర్జెన్సీ' మూవీ విడుదలకు ముందు కంగనాకు బెదిరింపులు
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు బెదిరింపులు వస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 27 Aug 2024 3:32 AM GMT'ఎమర్జెన్సీ' మూవీ విడుదలకు ముందు కంగనాకు బెదిరింపులు
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు బెదిరింపులు వస్తున్నాయి. కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. 'ఎమర్జెన్సీ' పేరతో ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే మూఈ విడుదలకు ముందు సిక్కు తీవ్రవాద గ్రూపుల నుండి హత్య బెదిరింపులు వచ్చాయి. సినిమాను విడుదల చేస్తే సర్దార్‌లు మిమ్మల్ని చెప్పులతో కొడతారని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను అప్‌లోడ్ చేశారు. ఇదే వీడియోను రీపోస్టు చేసిన కంగనా రనౌత్ పోలీసులను ట్యాగ్ చేసింది. ఇది గమనించాలంటూ కోరింది. హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు కంగనా రనౌత్.
వీడియోలో వ్యక్తి ఇలా బెదరించాడు.. 'మీరు ఇప్పటికే చెంపదెబ్బ తిన్నారు. నేను గర్వించదగిన భారతీయుడిని. మహారాష్ట్రంలో ఎక్కడ మిమ్మల్ని చూసినా మేం.. మా హిందువులు, క్రైస్తవులు, ముస్లిం సోదరులతో కలిసి చెప్పులతో స్వాగతం పలుకుతామన్నాడు. మరో వ్యక్తి మాట్లాడుతూ. చరిత్రను మార్చలేము. సినిమాలో సిక్కులను తీవ్రవాదులుగా చిత్రకరించినట్లు అయితే.. బయోపిక్‌గా వచ్చిన వ్యక్తి ఏం జరిగిందో గుర్తంచుకోవాలి.' అంటూ చంపేస్తామంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. కంగనా రనౌత్ ఈ వీడియోపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. "దయచేసి దీన్ని పరిశీలించండి" అని ఆమె మైక్రో బ్లాగింగ్ సైట్‌లో వ్రాసి మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్ పోలీసులను ట్యాగ్ చేసింది.
Please look in to this @DGPMaharashtra @himachalpolice @PunjabPoliceInd https://t.co/IAtJKIRvzI
— Kangana Ranaut (@KanganaTeam) August 26, 2024
కాగా.. కంగనారనౌత్ నటించిన ఇందిరాగాంధీ పాత్రలో నటించిన 'ఎమర్జెన్సీ' సినిమా సెప్టెంబరు 6న విడుదల కానుంది. ఈ సినిమా సిక్కు సమాజాన్ని చెడుగా చిత్రీకరిస్తోందని పేర్కొంటూ పలు సిక్కు సంస్థలు నిషేధం విధించాలని పిలుపునిచ్చాయి.