నటి సన్నీ లియోన్ ప్రదర్మనకు.. కేరళ యూనివర్సిటీ వీసీ నిరాకరణ

నటి సన్నీలియోన్‌కు కేరళ యూనివర్సిటీలో ప్రదర్శన ఇవ్వడానికి వీసీ నిరాకరించారు.

By అంజి  Published on  13 Jun 2024 5:38 AM GMT
Actor Sunny Leone, Kerala University, Kerala

నటి సన్నీ లియోన్ ప్రదర్మనకు.. కేరళ యూనివర్సిటీ వీసీ నిరాకరణ

నటి సన్నీలియోన్‌కు కేరళ యూనివర్సిటీలో ప్రదర్శన ఇవ్వడానికి వీసీ నిరాకరించారు. జూలై 5న తిరువనంతపురంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ క్యాంపస్‌లో ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. మనోరమ నివేదికల ప్రకారం, కేరళ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ మోహనన్ కున్నుమ్మల్ కళాశాల ప్రోగ్రామ్ జాబితా నుండి సన్నీ లియోన్ ప్రదర్శనను మినహాయించాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.

గత ఏడాది నవంబర్‌లో, కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కుశాట్)లో జరిగిన సంగీత కచేరీలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు. కాగా, సన్నీ తన తొలి మలయాళ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించింది. ముహూర్తం పూజ చేస్తున్న వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. టైటిల్‌ ఖరారు కానీ మలయాళ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించిన సమయంలో నటి సన్నీలియోన్‌ పూజ చేస్తున్న దృశ్యం వీడియోలో ఉంది. దీంతోపాటు సన్నీ 'కొటేషన్‌ గ్యాంగ్‌'లో కూడా కనిపించనుంది.

Next Story