చంద్రయాన్‌-3ని అపహాస్యం చేస్తూ పోస్టు.. ప్రకాష్‌ రాజ్‌పై ట్రోలింగ్‌

భారత్‌ మూన్ మిషన్‌ను అపహాస్యం చేస్తూ నటుడు ప్రకాష్‌ రాజ్ వివాదాస్పద ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

By అంజి  Published on  21 Aug 2023 10:15 AM IST
Actor Prakash Raj, Chandrayaan-3, trolling

చంద్రయాన్‌-3ని అపహాస్యం చేస్తూ పోస్టు.. ప్రకాష్‌ రాజ్‌పై ట్రోలింగ్‌

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రముఖ నటులలో ఒకరైన నటుడు ప్రకాష్ రాజ్ దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. అతను 'వాంటెడ్', 'సింగం', 'దబాంగ్ 2', 'పోలీసుగిరి' వంటి కొన్నింటిలో ప్రతికూల పాత్రలు పోషించి మంచి గుర్తింపు పొందాడు. తాజాగా తన మనసులోని మాటను చెప్పే వ్యక్తిగా ప్రఖ్యాతి గాంచిన ప్రకాష్ రాజ్.. భారత్‌ మూన్ మిషన్‌పై కొత్త ట్వీట్‌లో స్పందించారు. భారత్‌ మూన్ మిషన్‌ను అపహాస్యం చేస్తూ వివాదాస్పద ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. లుంగీ, చొక్కా ధరించి.. టీ పోస్తున్న వ్యక్తి యొక్క కార్టూన్‌ను షేర్ చేశాడు.

బ్రేకింగ్‌ న్యూస్‌.. #VikramLander Wowww ద్వారా చంద్రుని నుండి వచ్చిన మొదటి చిత్రం అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. దీంతో చంద్రయాన్-3పై ఎగతాళి చేసినందుకు ప్రకాష్‌ రాజ్‌పై నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తున్నారు. 'బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోదీపై గుడ్డి ద్వేషం' ఉన్నందుకే ఆయన ఈ పోస్ట్‌ను షేర్ చేశారని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్ వైరల్ అయిన వెంటనే, శాస్త్రవేత్తల కృషిని ఎగతాళి చేసినందుకు ట్విట్టర్ వినియోగదారులు అతనిని తప్పుపట్టారు. చంద్రయాన్ 3 భారతదేశానికి గర్వకారణం, అతని 'గుడ్డి ద్వేషం' కోసం సాధనం కాదని నెటిజన్లు ట్వీట్లు చేశారు.

చంద్రయాన్-3 ఆగష్టు 23, 2023 (బుధవారం) నాడు సాయంత్రం 6.04 నిమిషాలకు చంద్రునిపై ల్యాండ్ కానుంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను విజయవంతం చేసేందుకు ఇస్రో కృషి చేస్తోంది. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ జరిగితే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన ప్రపంచంలో నాల్గవ దేశంగా భారత్‌ అవతరిస్తుంది. చంద్రయాన్-3 మిషన్ ల్యాండర్‌కు విక్రమ్ సారాభాయ్ (1919–1971) పేరు పెట్టారు. విక్రమ్‌ సారాభాయ్‌ భారత అంతరిక్ష పితామహుడిగా పేరు పొందారు.

Next Story