కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటి ఖుష్బూ ఘోర రోడ్డు ప్రమాదం నుండి తృటిలో బయటపడ్డారు. తాను ప్రయాణిస్తున్న కారును కంటెయినర్ ఢీకొనడంతో కారు దెబ్బతింది. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఖుష్బూకు ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కడలూరు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని ఖుష్బూ ట్విటర్‌లో పేర్కొన్నారు.
దేవుడి దయ వల్ల నేను క్షేమంగా ఉన్నాను. ఈ మేరకు ప్రమాదానికి గురైన కారు ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేసింది. ఇదిలావుంటే తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించిన కుష్బూ.. తెలుగులో కలియుగ పాండవులు, పేకాట పాపారావు, రాక్షస సంహారం, జయసింహ, తేనెటీగ, స్టాలిన్, అజ్ఞాతవాసి వంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది. ఈమె నటనకు ఫిదా అయిన తమిళ అభిమానులు గుడి కూడా కట్టారు. అప్పట్లో ఇది సంచలనం అయ్యింది.