శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి.. కూలిన ఆలయ మెట్ల బావి.. 25 మందికిపైగా.. వీడియో
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీరామనవమి వేడుకల్లో పెను ప్రమాదం జరిగింది. ఇండోర్‌లోని ఓ ఆలయంలో గురువారం రామనవమి వేడుకలు
By అంజి
శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి.. కూలిన ఆలయ మెట్ల బావి.. 25 మందికిపైగా..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీరామనవమి వేడుకల్లో పెను ప్రమాదం జరిగింది. ఇండోర్‌లోని ఓ ఆలయంలో గురువారం రామనవమి వేడుకలు జరుగుతుండగా మెట్ల బావి కూలడంతో.. 25 మందికిపైగా బావిలో చిక్కుకున్నారు. నగరంలోని స్నేహ నగర్ ప్రాంతంలోని శ్రీ బాలేశ్వర్ ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటన తర్వాత అనేక వీడియోలు ఆలయంలో గందరగోళం, రెస్క్యూ కార్యకలాపాలను చూపించాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు పది మందిని రక్షించారు. అందిన సమాచారం ప్రకారం.. ఆలయం లోపల భక్తులు బావిపై నిలబడి ఉండగా, బావి మెట్లు కూలిపోయాయి.
इंदौररामनवमी के मौके पर श्री बेलेश्वर महादेव झूलेलाल मंदिर में श्रद्धालुओं की भीड़ थी इसी बीच बावड़ी की छत धंस गई।हादसे में 25 लोग दबे। बचाव कार्य जारी। pic.twitter.com/ro02gklY5P
— काश/if Kakvi (@KashifKakvi) March 30, 2023
బావిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సంఘటన జరిగిన సమయంలో దాదాపు రెండు డజన్ల మందికిపైగా మెట్టు బావిపై నిలబడి ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంబులెన్స్‌లు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోలేదని స్థానికులు తెలిపారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సంఘటన గురించి తెలుసుకున్నారు, ఆ తర్వాత ఆలయంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇండోర్ జిల్లా యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తూ.. 10 మందిని రక్షించారని, తొమ్మిది మంది చిక్కుకుపోయారని ధృవీకరించారు. గాయపడిన కొందరిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు సీఎం చౌహాన్ తెలిపారు. సంఘటనా స్థలంలో ఇండోర్ పోలీసు, జిల్లా యంత్రాంగం సీనియర్ అధికారులు పాల్గొన్నారు.