అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు ఒకటి. ఇది లేకుండా ఎలాంటి ప్రభుత్వ పథకాన్ని పొందలేరు. బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, పాన్ కార్డు పొందాలన్నా, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరాలన్నా ఆధార్ తప్పనిసరి. అయితే ఆధార్ అప్‌డేట్ చేసుకోవడానికి డిసెంబర్ 14తో గడువు ముగుస్తోంది. ఇప్పటికే చాలా సార్లు గడువు తేదీని పెంచిన కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆ గడువును పెంచుతుందో లేదో తెలీదు. అప్పటిలోపే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆధార్ తీసుకుని 10 సంవత్సరాలు పూర్తైన వారు తమ కార్డును అప్‌డేట్ చేసుకోకపతే.. ఆ కార్డులను రద్దు చేస్తామని ఇదివరకే ప్రకటించారు. అలాగే ఫ్రీ అప్‌డేట్‌కు డిసెంబర్ 14ను చివరి రోజుగా నిర్ణయించారు. ఒకవేళ గడువు లోగా ఆధార్ అప్‌డేట్ చేసుకోలేకపోతే.. రుసుము చెల్లించి అప్‌డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మై ఆధార్ పోర్టల్ ఓపెన్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు.