నిర్ణయానికి రాకూడదని పేర్కొంది. మోటారు ప్రమాద పరిహారం కేసులో బాధితురాలి వయస్సును నిర్ధారించేందుకు ఆధార్ కార్డులో పేర్కొన్న పుట్టిన తేదీని ఆమోదించాలన్న పంజాబ్, హర్యానా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయమూర్తులు సంజయ్ కరోల్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం వయస్సు రుజువుగా ఆధార్ కార్డ్‌ను ప్రామాణికంగా తీసుకోలేమని స్పష్టం చేసింది.
మరణించిన వారి వయస్సును నిర్ణయించడానికి ఆధార్ కార్డ్‌లో పేర్కొన్న పుట్టిన తేదీని సూచించడానికి బదులుగా, మరణించిన వారి వయస్సును చట్టబద్ధమైన గుర్తింపు పొందిన పాఠశాల సర్టిఫికేట్‌లో పేర్కొన్న పుట్టిన తేదీ నుండి మరింత అధికారికంగా నిర్ణయించవచ్చని కోర్టు పేర్కొంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి తరఫు ఫ్యామిలీకి నష్టపరిహారాన్ని నిర్ణయించే క్రమంలో ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని హైకోర్టు ప్రామాణికంగా తీసుకుంది.
దీంతో నష్టపరిహారం తగ్గిపోవడంతో బాధిత కుటుంబం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. యూఐఏఐ జారీ చేసిన సర్క్యులర్, కేంద్ర సమాచార శాఖ ఇచ్చిన ఆఫీస్ మెమో కూడా ఆధార్ కార్డును వయసు నిర్దారణ పత్రంగా భావించరాదని పేర్కొన్న విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. మోటారు వాహన చట్టం కూడా స్కూల్ సర్టిఫికెట్‌ను ఆయా వ్యక్తుల వయసు నిర్దారణకు సాధికారికంగా గుర్తిస్తోంది.